"చింతల మాణిక్య రెడ్డి ఆధ్వర్యంలో మోదీ సభకు భారీ జనసమీకరణ.|

0
495

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నగరానికి రానున్నారనే వార్తతో ఆల్వాల్ సర్కిల్ మొత్తం ఆదివారం ఉదయం నుంచే పండుగ వాతావరణాన్ని తలపించింది. 

వివిధ కాలనీల్లో కార్యకర్తల ఆనందోత్సవాలు అంబరాన్నంటాయి. ప్రతి వీధిలో కాషాయ జెండాలు రెపరెపలాడగా, ఆల్వాల్ ప్రాంతమంతా కాషాయ వర్ణంతో కళకళలాడింది. యువత, మహిళలు, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి మోదీకి స్వాగత నినాదాలు చేశారు.

రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చింతల మాణిక్య రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు బ్యాండ్ మేళాలు, డప్పుల వాయిద్యాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.

టపాసులు కాలుస్తూ, భారత్ మాతాకీ జై.. మోదీ జీ జిందాబాద్ అంటూ నినాదాలతో ఆల్వాల్ ప్రాంతాన్ని మార్మోగించారు. మోదీ సభకు వెళ్లే ముందు కార్యకర్తల ఉత్సాహం చూసిన స్థానికులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా చింతల మాణిక్య రెడ్డి మాట్లాడుతూ, “ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశానికి అందిస్తున్న నాయకత్వంపై ప్రజల్లో అపారమైన విశ్వాసం ఉంది. అందుకే ఆల్వాల్ సర్కిల్ నుంచి స్వచ్ఛందంగా వేలాదిమంది సభకు తరలివచ్చారు.

దేశాభివృద్ధి, యువత భవిష్యత్తు కోసం మోదీజీ చేస్తున్న కృషికి ప్రజలు అండగా నిలుస్తున్నారు” అని పేర్కొన్నారు.

కార్తీక్ గౌడ్, శ్రీనివాస్ వర్మ, శ్రీధర్ రెడ్డి, అనిల్ కుమార్, శ్రవంతి, మహేందర్ రెడ్డి, సుజాత, లక్ష్మణ్, చరణ్, సచిన్, విజయ్, సర్వేశ్వర్ రావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఆల్వాల్ సర్కిల్ నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు సభకు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రభుత్వ మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణ ఆపాలి
ప్రెస్ నోట్ తేదీ 20/12/2025 విజయవాడ   ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ అపాలి. పీపీపీ...
By Rajini Kumari 2025-12-20 12:54:06 0 226
Punjab
Punjab Braces for Monsoon with High-Tech Finnish Fleet
Following the successful fortification of critical riverbanks and flood infrastructure,...
By Lokeshwari Panthadi 2026-06-30 05:52:41 0 78
Andhra Pradesh
ఆయుష్ ప్రాంతీయ కార్యా లయంలో నిర్మాణ మెటీరియల్ పంపిణీ
విశాఖ పట్నం లో గల మధుర వాడ యందు ఆయుష్ ప్రాంతీయ ఉప సంచాలకులు జోనల్ - 1 వారి కార్యాల యం మంగళ వారం...
By Mobbu Venkatramana 2026-03-10 11:22:46 0 328
BMA
Consumer Shield: Press Forcing Safety Product Recalls
Investigative consumer journalism wields immense commercial power by testing dangerous household...
By JoinBMA 2026-08-21 10:58:38 0 70
Ladakh
Ladakh Strengthens Disaster Management and Preparedness
Ladakh continues to enhance its disaster management capabilities by improving preparedness for...
By Fathima Safa 2026-07-01 10:13:25 0 189
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com