"మిషన్ 'కొత్త చెరువు': క్షేత్రస్థాయిలో మాజీ కార్పొరేటర్ తనిఖీ.|

0
351

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : స్థానిక ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా కొత్త చెరువులో పేరుకుపోయిన గుర్రపుడెక్క తొలగింపు పనులను మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 

ఎంటమాలజీ సూపర్వైజర్ గణేష్, టీమ్ సభ్యులు సాజిద్, లింగారెడ్డి, మహేందర్ మరియు పోచయ్యలతో కలిసి ఆమె పనులను నిశితంగా పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గుర్రపుడెక్క వల్ల నీరు నిలిచిపోయి దోమలు విపరీతంగా పెరుగుతున్నాయని, దీనివల్ల స్థానికులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 

దోమల నివారణకు, పరిసరాల పరిశుభ్రతకు ఈ గుర్రపుడెక్కను పూర్తిగా తొలగించడం అత్యవసరమని అధికారులకు సూచించారు.

పనులను వేగవంతం చేయాలని, మళ్లీ గుర్రపుడెక్క పెరగకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు మరియు పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచేందుకు ఇలాంటి నిరంతర ప్రయత్నాలు కొనసాగుతాయని ఆమె స్పష్టం చేశారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: చికిత్స పొందుతూ వృద్ధురాలు మృతి కొత్తూరు మురళి
అన్నమయ్య జిల్లా, రామసముద్రం మండలం మాలేనత్తం గ్రామానికి చెందిన ఆదెమ్మ ఆదివారం తమ వ్యవసాయ పొలంలో...
By Kothuru Murali 2026-06-22 10:55:27 0 115
Assam
23 get life term for killing woman on suspicion of practising witchcraft in Assam
23 get life term for killing woman on suspicion of practising witchcraft in Assam. The court...
By BMA ADMIN 2025-05-19 17:36:23 0 2K
SURAKSHA
అతరరాజ్ సాయిబర్ నెట్‌వర్క్ కా భండాఫోడ్: పులిస్ నే కియా బడా ఖులాసా
ఇటీవల పోలీసులు ఒక భారీ అంతర్రాష్ట్ర సైబర్ నెట్‌వర్క్‌ను ఛేదించి, కీలక సభ్యులను అరెస్టు...
By Kalaga Sailaja 2026-06-24 12:07:00 0 126
Telangana
ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మహాత్మా గాంధీ...
By Sidhu Maroju 2025-12-17 15:02:46 0 284
Andhra Pradesh
సుప్రీంకోర్టులో పెద్దిరెడ్డి భార్యకు చుక్కెదురు.
పెద్దిరెడ్డి భార్యకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. తాము PLR ప్రాజెక్ట్ Pvt. Ltd సంస్థ తరఫున...
By Pagadala Venkateswar 2026-03-25 12:59:16 0 215
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com