ఇక బరువు తగ్గొద్దు లోకేశ్.. ప్రధాని మోదీ సరదా సూచన!

0
130

హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ప్రధాని మోదీకి తేనీటి విందు

ఫిట్‌నెస్ విషయంలో మోదీయే తనకు స్ఫూర్తి అన్న లోకేశ్

మోదీ, చంద్రబాబు ఇద్దరూ తనకు మెంటార్లేనని వెల్లడి

రాష్ట్రానికి అందిస్తున్న సాయానికి మోదీకి కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు

"ఇకపై బరువు తగ్గవద్దు లోకేశ్, ఇప్పటికే చాలా స్లిమ్‌గా ఉన్నావు" అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏపీ మంత్రి నారా లోకేశ్‌కు సరదాగా సలహా ఇచ్చారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో జరిగిన తేనీటి విందులో ఈ ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది. లోకేశ్ ఫిట్‌నెస్‌పై చర్చ వచ్చినప్పుడు, ఆయన ఇలా స్లిమ్‌గా, ఫిట్‌గా మారడానికి ప్రధాని మోదీనే కారణమని చంద్రబాబు తెలిపారు. తొలిసారి ప్రధానితో భేటీ అయిన తర్వాతే లోకేశ్ తన డైట్, ఫిట్‌నెస్‌పై పూర్తిస్థాయిలో శ్రద్ధ పెట్టారని మోదీకి వివరించారు. దీనికి స్పందించిన ప్రధాని, లోకేశ్‌ను అభినందిస్తూనే, ఇక బరువు తగ్గవద్దని సూచించారు.

 

ఈ సంభాషణపై లోకేశ్ స్పందిస్తూ, ఫిట్‌నెస్ విషయంలో తనకు ప్రధాని మోదీయే స్ఫూర్తి అని అన్నారు. "దేశం కోసం క్షణం తీరికలేకుండా పనిచేస్తున్నా, 75 ఏళ్ల వయస్సులో మీరు పాటించే ఆరోగ్య సూత్రాలు, శారీరక దృఢత్వం నాకు ఎంతో స్ఫూర్తినిస్తాయి. మీ పని విధానం చూస్తుంటే 25 ఏళ్ల వయసున్న ముగ్గురు యువకులు మీలో ఉన్నట్లు చురుగ్గా పనిచేస్తారు. మీ స్ఫూర్తితో మరింత ఫిట్‌గా మారతాను" అని లోకేశ్ ప్రధానితో చెప్పారు. ఈ సమావేశం సందర్భంగా రాష్ట్రాభివృద్ధికి కేంద్రం, ప్రధాని అందిస్తున్న సాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.

 

సరదా సంభాషణలతో సాగిన భేటీ

 

గంటకు పైగా సాగిన ఈ సమావేశం ఆద్యంతం సరదా సంభాషణలతో, నవ్వులతో సాగింది. చంద్రబాబు నివాసంలోకి అడుగుపెడుతూనే, సరిగ్గా ఏడాది క్రితం ఢిల్లీలో తన చేతుల మీదుగా ఆవిష్కరించిన 'యువగళం' కాఫీ టేబుల్ బుక్ ఫొటో ఫ్రేమ్‌ను చూసి ప్రధాని మోదీ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. అనంతరం చంద్రబాబు ఇంటిలోని రామ మందిరంలో ప్రధాని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడున్న పంచలోహ సీతారాముల విగ్రహాలను దివంగత ఎన్టీ రామారావు తమకు బహూకరించారని చంద్రబాబు ప్రధానికి వివరించారు.

 

ఈ సమావేశంలో లోకేశ్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఇద్దరూ తనకు గురువులు, మెంటార్లని అన్నారు. దేశ స్థాయిలో మోదీ, రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు ప్రజా సంక్షేమం, అభివృద్ధిలో తనకు మార్గదర్శకులని పేర్కొన్నారు. వారిద్దరి స్పీడ్ అందుకోవాలన్నదే తన కల అని తెలిపారు. ఆనవాయతీ ప్రకారం, తన నియోజకవర్గమైన మంగళగిరిలో తయారైన చేనేత శాలువాతో లోకేశ్ ప్రధానిని సత్కరించి, దాని విశిష్టతను వివరించారు.

Search
Categories
Read More
SURAKSHA
Guardian of the Streets: The Journey of Shri G.S. Malik
Unwavering Resolve, Tactical Brilliance, and Absolute Commitment to Public Safety Within the...
By Kalaga Sailaja 2026-07-28 13:28:45 0 154
Karnataka
Bengaluru Faces Rat-Fever Spike Amid Sanitation Crisis
Since the beginning of 2025, over 400 cases of leptospirosis (rat fever) have been reported in...
By Bharat Aawaz 2025-07-17 06:39:49 0 2K
Telangana
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గృహ ప్రవేశలు & పలు అభివృద్ధి పనులలో పాల్గొన్న ఎంమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల జిల్లా జూన్ 1: ప్రజా పాలన ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా కొఠారి గ్రామపంచాయతీలోని...
By Avunoori Mahesh 2026-06-01 22:59:41 0 166
Andhra Pradesh
పుంగనూరు : పుంగునూరు పట్టణంలో లో కూటమి నాయకుల సంబరాలు
గురువారం సాయంత్రం పుంగనూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలలో కూటమి నాయకులు సంబరాలు చేసుకున్నారు....
By Kothuru Murali 2026-04-03 09:47:38 0 188
SURAKSHA
Shri K. Surendra Mohan, IAS: Driving Farm Reforms
From district administration to the corridors of the Telangana Secretariat, Shri K. Surendra...
By Lokeshwari Panthadi 2026-07-14 06:10:02 0 208
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com