సింధు హాస్పిటల్ — మూడు పార్టీల చేతులు కలిసిన కథ

0
152

హేటెరో గ్రూప్ చైర్మన్, BRS రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథి రెడ్డి — తన ప్రియమైన కుమార్తె కృష్ణ సింధురి జ్ఞాపకార్థం హైటెక్ సిటీలో అద్భుతమైన క్యాన్సర్ ఆస్పత్రి నిర్మించారు.

‎ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా దాన్ని జాతికి అంకితం చేస్తున్నారు.

‎కానీ ఈ ఆస్పత్రి వెనుక ఉన్న రాజకీయ కథ చదవండి...

‎2018 — BRS హయాంKCR ప్రభుత్వం ఖానామెట్‌లో ₹500 కోట్ల విలువైన 15 ఎకరాల ప్రభుత్వ భూమిని — కేవలం ₹1.47 లక్షల వార్షిక అద్దెకు సాయి సింధు ఫౌండేషన్‌కు అప్పగించింది. అదే సమయంలో హేటెరో గ్రూప్ BRS కి ₹120 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు — ఆ తర్వాత పార్థసారథి రెడ్డికి రాజ్యసభ సీటు.

‎2023 — హైకోర్టు జోక్యం ఈ లీజు చట్టవిరుద్ధమని హైకోర్టు GO రద్దు చేసింది. మళ్ళీ పరిశీలించమని ఆదేశించింది.

‎అదే 2023 — రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ "ఈ భూమి కేటాయింపు పూర్తిగా చట్టవిరుద్ధం. అధికారంలోకి వస్తే సంబంధితులందరినీ జైల్లో వేస్తాం!"

‎మార్చి 2024 — అదే రేవంత్ రెడ్డి CM అయ్యాక అప్పటికే సగానికిపైగా నిర్మాణం పూర్తయింది. GO 37 జారీ చేసి లీజు ఖరారు చేశారు. జైలు మాటేది? మాయమైంది.

‎మే 10, 2026 — ఈ రోజు BRS ఎంపీ నిర్మించిన ఆస్పత్రిని BJP ప్రధాని ప్రారంభిస్తున్నారు. Congress CM వేదికపై ఉంటారు.

‎BRS భూమి ఇచ్చింది ✅ Congress లీజు ఖరారు చేసింది ✅ BJP ప్రారంభించింది ✅

‎మూడు పార్టీలు — ఒకే లబ్ధిదారుడు. తెలంగాణ రాజకీయాల్లో ఇది కొత్తేమీ కాదు!

Search
Categories
Read More
Telangana
ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి
*ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి*    *జేసీకి బీజేపీ నాయకుల వినతి* ...
By Peetla Shivakumar 2026-04-10 15:06:14 0 363
Andhra Pradesh
Madanapalle: మదనపల్లె రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మాజీ సైనికుడు కంచర్ల మధు కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపిన వైసీపీ నాయకులు జయదేవ్, హర్షవర్ధన్.
Madanapalle: మదనపల్లె కు చెందిన మాజీ సైనికుల సంఘం డివిజన్ అధ్యక్షుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు...
By Pagadala Venkateswar 2026-08-13 05:34:31 0 91
BMA
Supreme Court Blocks Police Demanding Digital Footprints
In a major victory for source protection, the Supreme Court demanded answers from Uttar Pradesh...
By JoinBMA 2026-09-11 06:43:15 0 122
Lakshdweep
Coastal and Marine Conservation Efforts in Lakshadweep
Coastal and marine conservation has been a key priority in Lakshadweep due to its rich...
By Fathima Safa 2026-06-18 09:11:01 0 351
Andhra Pradesh
పుంగనూరు మోడల్ స్కూల్లో అడ్మిషన్లు ప్రారంభం
పుంగనూరు పరిధిలోని అడవినాథుని కుంట ఏపీ మోడల్ స్కూల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను బుధవారం...
By Kothuru Murali 2026-06-10 13:31:04 0 114
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com