సింగరేణిలో సమ్మె సైరాన్! సమ్మెకి సై అంటున్న కార్మిక సంఘాలు

0
256

మంచిర్యాల : సింగరేణి అంటే కేవలం బొగ్గు గనులు కాదు, అది వేలాది కార్మిక కుటుంబాల జీవితం, తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక,చీకటిని తొలగించి వెలుగునిచ్చే శక్తి,భూమి లోతుల్లో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసే కార్మికుల చెమటతోనే సింగరేణి నిలబడి ఉంది, ప్రతి టన్ను బొగ్గు వెనుక ఒక కార్మికుడి కష్టం,తెలంగాణ ప్రాంతల అభివృద్ధి దాగి ఉంది,ఈ రోజు విద్యుత్ వెలుగులతో మెరిసే తెలంగాణ వెనుక సింగరేణి కార్మికుల శ్రమ ఎంతో ఉంది, రాత్రింబవళ్లు పనిచేస్తూ దేశానికి ఇంధనం అందించే కార్మికుల కష్టాలను గత ప్రస్తుత,ప్రభుత్వలు నిర్లక్ష్యం చేస్తూ సింగరేణి మనుగడను ప్రశ్నర్ధకంగ మారుస్తున్నాయి అని కార్మికులు,కార్మిక సంఘాలు నాయకులు ప్రభుత్వలను ప్రశ్నిస్తున్నారు.

కార్మికుల ఆగ్రహానికి కారణాలేంటి?

సింగరేణి కార్మికులు గత కొన్ని సంవత్సరాలుగా అనేక సమస్యలపై ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారుఉద్యోగ భద్రత లేకపోవడం,కొత్త నియామకాల తగ్గింపు,ప్రైవేటీకరణ భయం,బొగ్గు గనుల మూసివేత నిర్ణయాలు,కార్మిక సంక్షేమంలో కోతలు,జీతాల ఒప్పందాల్లో ఆలస్యం,ప్రమాదాల్లో భద్రతా లోపాలు,100 మాస్టార్ల పేరుతో ఉద్యోగుల తొలగింపు,మారుపేర్లు, విజిలెన్స్ ఎంక్వయిరీ పేరులతో యాజమాన్యం కాలక్షేపం,పెండింగ్ సమస్యల పై నిర్లక్ష్య ధోరణి, కార్మిక సంఘాల అభిప్రాయం ప్రకారం, ప్రభుత్వాలు సంస్థ లాభాలను మాత్రమే చూస్తున్నాయి కానీ కార్మికుల భవిష్యత్తును పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి,

ప్రభుత్వాలపై ఆరోపణలు?

కార్మిక సంఘాలు చేస్తున్న ప్రధాన ఆరోపణలు:కార్మిక సంఘాలతో చర్చలు లేకుండా నిర్ణయాలు,ప్రైవేట్ కంపెనీలకు ప్రాధాన్యం,కార్మిక సంక్షేమ నిధుల తగ్గింపు,స్థానిక యువతకు ఉద్యోగాల్లో అన్యాయం,గనుల ప్రాంతాల అభివృద్ధిలో నిర్లక్ష్యం,విపక్షాలు కూడా ప్రభుత్వాలు సింగరేణిని క్రమంగా బలహీనపరుస్తున్నాయని విమర్శిస్తున్నాయి.

పరిష్కారం ఏంటి నిపుణులు సూచిస్తున్న అంశాలు? 

కార్మిక సంఘాలతో తక్షణ చర్చలు జరిపి ఉద్యోగ భద్రతపై స్పష్టమైన హామీ,ప్రైవేటీకరణపై పారదర్శక విధానం,భద్రతా ప్రమాణాల పెంపు,స్థానిక యువతకు ఉద్యోగ ప్రాధాన్యం,గనుల ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు,సింగరేణి సమ్మె కేవలం కార్మికుల సమస్య కాదు,ఇది తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, వేలాది కుటుంబాల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అంశం. ప్రభుత్వాలు, యాజమాన్యం, కార్మిక సంఘాలు కలిసి పరిష్కారం కనుగొనకపోతే, సింగరేణి భవిష్యత్తు మరింత సంక్షోభంలో పడే ప్రమాదం ఉందని కార్మిక వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: వైసిపి స్టేట్ పబ్లిసిటీ వింగ్ సెక్రటరీగా హేమచంద్ర
వైసిపి పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, శుక్రవారం చిత్తూరు జిల్లా, పుంగనూరు...
By Kothuru Murali 2026-02-21 08:31:43 0 177
Andhra Pradesh
నారాయణ విద్యాసంస్థలపై విద్యార్థి సంఘాల ఆందోళన
పుంగనూరు పట్టణంలోని ఎంఈఓ కార్యాలయం ఎదుట శనివారం విద్యార్థి సంఘ నాయకులు నిరసన తెలిపారు. నారాయణ...
By Kothuru Murali 2026-06-20 16:18:11 0 111
Telangana
మనూర్:- అకాల వర్షాలు పంట నష్టం
మనూర్ మండలంలో సోమవారం సాయంత్రం నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అకాల వర్షం వలన...
By Gandla Vaijanath 2026-03-16 15:30:01 0 557
BMA
Print Circulation Drops: The Financial Crisis Deepens
The Indian print media is facing a severe financial reckoning, with daily newspaper circulation...
By JoinBMA 2026-08-20 07:40:08 0 63
Andhra Pradesh
దోపిడీ దొంగలను పట్టుకున్న తాడేపల్లి పోలీసులు
గుంటూరు    *దోపిడీ దొంగను అరెస్ట్ చేసిన తాడేపల్లి పోలీసులు*   *జిల్లా ఎస్పీ...
By Rajini Kumari 2026-01-11 09:44:11 0 226
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com