ప్రజలకు వ్యాపారాలకు ఇబ్బంది లేకుండా చూస్తాం గద్దె రామ్మోహన్ గారు

0
165

*ప్రజలకు, వ్యాపారులకు ఇబ్బంది లేకుండా చూస్తాం*

*14వ డివిజన్‌లో చేపల వంతెన దగ్గర పర్యటించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌*

*+++*

 

తూర్పు నియోజకవర్గ పరిధిలోని చేపల వంతెన దగ్గర ఉన్న చిరు వ్యాపారులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. 

 

శుక్రవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 14వ డివిజన్‌లోని చేపల వంతెన దగ్గర తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్, జనసేన పార్టీ నాయకుడు అమ్మిశెట్టి వాసుతో కలిసి పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఆయన స్వయంగా అక్కడి వారిని అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించాల్సిందిగా ఆయా విభాగాల అధికారులను ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ ఆదేశించారు.  

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ స్థానికంగా ఉన్న రోడ్డుపై లారీలు, బస్సులు రాకపోకలు సాగించడానికి చాలా ఇబ్బందిగా ఉన్న విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా స్థానికులకు ఉపయోగపడే విధంగా చేయాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఖాళీ స్థలంలో చిరు వ్యాపారులు అక్కడ వ్యాపారాలు నిర్వహించుకునేలా చేసేందుకు ఉన్న మార్గాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. నియోజకవర్గంలో ఎమ్మార్వో కార్యాలయం నిర్మాణానికి స్థలం లేకపోవడం చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. అదే విధంగా అంగన్‌వాడీ స్కూల్స్‌ నిర్మాణం చేయడానికి స్థలం లేకపోవడం వల్ల వారు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ స్థలాల్లో ముందుగా అంగన్‌వాడీ స్కూల్స్‌ నిర్మాణం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఇటీవల జరిగిన సమావేశంలో స్పష్టం చేశారన్నారు. ప్రభుత్వ స్థలాలను ప్రజలకు ఇబ్బంది లేకుండా చిరు వ్యాపారులకు ఉపాధి కల్పించేలా చేయడానికి ఉన్న మార్గాలను అన్వేషించి వారికి న్యాయం చేస్తామని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు.  

 

*జనసేన పార్టీ నాయకుడు అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ* రోడ్లపై వ్యాపారాలు నిర్వహించే వారు తమకు ప్రభుత్వ స్థలంలో దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ను కోరారన్నారు. ఇక్కడ ఉన్న స్థలాన్ని వారికి కేటాయించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తానని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ హామీ ఇచ్చారన్నారు.

 

ఈ కార్యక్రమంలో చెన్నుపాటి గాంధీ, కాంతిశ్రీ, ముమ్మనేని ప్రసాద్, కర్ణ రమేష్, గరికపాటి బద్రి, అన్నాబత్తుల బాబి, రత్నం రమేష్, యడ్లపల్లి నాగరాజు, వాటాల హరిప్రసాద్, రాధాకృష్ణ, ఫాతిమా, కెల్ల రమేష్‌ నాయుడు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
ఇతను కాక ఇంకెవరు తెలంగాణ జాతిపిత.....?
ఆగిన తొలిదశ ఉద్యమాన్ని ఆకాశానికి అంటేలా తట్టి లేపి అలుపెరుగకుండా 14 ఏళ్ళు తెలంగాణలోని ప్రతీ...
By Ponnala Srinivasrao 2026-06-04 05:10:10 0 120
Andhra Pradesh
మదనపల్లెలో ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ల పంపిణీ.
మదనపల్లె 34వ వార్డు ఇంచార్జ్ బాలమలి శేఖర్, 35వ వార్డు ఇంచార్జ్ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం...
By Pagadala Venkateswar 2026-01-31 07:47:48 0 195
Andhra Pradesh
ఫోర్త్ సిటీ అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే డిపిఆర్ కోసం టెండర్స్
*ఫోర్త్ సిటీ అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే డీపీఆర్ కోసం టెండర్స్*    ఫ్యూచర్ సిటీ నుంచి...
By Rajini Kumari 2025-12-31 10:22:16 0 229
Mizoram
Mizoram Launches NID Pulse Polio Immunisation Drive
The government of Mizoram has officially launched its National Immunisation Day (NID) Pulse Polio...
By Lokeshwari Panthadi 2026-07-02 06:31:43 0 108
Telangana
అభ్యర్థుల గెలుపు కోసం పూజ‌లు
మూడవ విడత ఎన్నికలు మహబూబాబాద్ జిల్లా  కొత్తగూడ మండలంలో గ్రామాల అభివృద్ధి కొరకు కాంగ్రెస్...
By Bheeshman King 2025-12-13 10:55:46 0 377
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com