ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఏఐఎస్ఎఫ్ నాయకులు హెచ్చరించారు

0
174

ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యస్ షాబీర్ భాష ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి జీవో నెంబర్ 1కి వ్యతిరేకంగా పట్టణంలో ఫ్లెక్సీలు, ఓర్డింగ్ బోర్డులు పెట్టి తప్పుడు ప్రచారాలు నిర్వహిస్తున్న ప్రవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల అక్రమ దోపిడిని అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ తాలూకా సమితి ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది దీన్ని ఉద్దేశించి ఏఐఎస్ఎఫ్ జిల్లాప్రధాన కార్యదర్శి యస్.షాబీర్ భాష, జిల్లా సహాయ కార్యదర్శి థామస్, జిల్లా ఉపాధ్యక్షుడు ఈరేష్*లు 

 మాట్లాడుతూ మంత్రాలయం లో ఉన్నటువంటి ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు అక్రమంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ప్రచారాలు నిర్వహించకూడదని నిబంధన ఉన్నప్పటికీ ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి తమ విద్యా సంస్థల యొక్క ర్యాంకుల ప్రచారాలు నిర్వహిస్తూ పెద్దపెద్ద ఫ్లెక్సీలు, బోర్డింగ్ బోర్డులు పెట్టి ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తూ, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నాయి. అడ్మిషన్ల పేరుతో భారీగా ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మారుస్తున్నారు కొన్ని విద్యా సంస్థలు అయితే ప్రభుత్వం నుండి ఎలాంటి గుర్తింపు లేకున్నా ముందస్తు అడ్మిషన్లు నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తున్నారు మరోవైపు పెద్ద పెద్ద ప్రచార బోర్డులు పెట్టి, ప్రధాన కూడలిలలో పెద్ద పెద్ద ఫ్లెక్సీలతో ప్రచారాలు నిర్వహిస్తూ పిఆర్వోలను విద్యార్థుల ఇండ్లకు పంపించి అడ్మిషన్లు నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రభుత్వా నియమ నిబంధనలు ఉల్లంఘించి ప్రచారాలు నిర్వహిస్తూ అడ్మిషన్లు చేస్తున్నప్పటికీ మంత్రాలయంలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం ప్రవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలకు నిదర్శనం అన్నారు విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ లోపం వల్లే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు వాళ్లకిష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారన్నారు , ఇప్పటికైనా ప్రభుత్వ నియామ నిబంధనలు ఉల్లంఘించి ప్రభుత్వ గుర్తింపు లేకుండా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న విద్యాసంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల ఎదుట ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. అనంతరం ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల కోశాధికారి వీరేష్,నాయకులు, శివ , ఆకాష్, నర్సప్ప, రాజు, నవీన్, దివాకర్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
ఆశా వర్కర్లతో కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి చాయ్ పే చర్చ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి తన కార్యాలయంలో చాయ్ పే...
By Sidhu Maroju 2026-01-10 12:33:34 0 239
Telangana
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత నేత్ర శిబిరం
ఐ వి వై విద్యాసంస్థ లో ఉచిత నేత్ర శిబిరం, కంటి సంరక్షణతో పాటు దేశభక్తి సందేశం ... ఘనంగా ముగిసిన...
By Thalakokkula Sadanandam 2026-07-23 10:33:54 0 236
Telangana
తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు ఎప్పటినుంచంటే?
తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు ఎప్పటినుంచంటే? తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం గుడ్...
By Pinnehasan Odela 2026-04-01 07:12:35 0 214
Telangana
"విద్యుత్ ఘాతంతో మరణించిన బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి."|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆల్వాల్ పరిధిలో ఇటీవల టెలికాం కాలనీలో చోటుచేసుకున్న ఘోర విద్యుత్...
By Sidhu Maroju 2026-06-16 10:51:48 0 140
Telangana
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేసిన కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్
 దొడ్డి అల్వాల్ సుభాష్‌నగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్తులకు కార్పొరేటర్  సబిత అనిల్...
By Sidhu Maroju 2025-06-26 10:06:01 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com