విద్యార్థుల కలలకు రెక్కలు

0
267

కలలకు రెక్కలు:

నందిగామ టాపర్లకు విమానంలో హైదరాబాద్ ప్రయాణం

విద్యా ప్రతిభను గౌరవించిన తంగిరాల సౌమ్య – బడుగు విద్యార్థుల కల నెరవేర్చిన ‘కలలకు రెక్కలు’ కార్యక్రమం

 

నందిగామ, మే 5: భారత్అవాజ్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ విప్ ,ఎమ్మెల్యే శ తంగిరాల సౌమ్య  ఆధ్వర్యంలో ‘కలలకు రెక్కలు’ కార్యక్రమం కింద పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపిన ఆరు మంది విద్యార్థులు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్ వరకు విమాన ప్రయాణం చేశారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో కలలు సాకారం చేసే దిశగా ఒక మంచి అడుగు అని అందరూ ప్రశంసించారు.

విమాన ప్రయాణంలో పాల్గొన్న విద్యార్థులు

షేక్ అర్షియా నాజ్ – కంచికచర్ల మండలం మొగులూరు జిల్లా పరిషత్ హైస్కూల్, 589 మార్కులు.

ప్రజాపతి పర్వీన్ – నందిగామ మండలం లింగాలపాడు జిల్లా పరిషత్ హైస్కూల్, 576 మార్కులు.

వీరులపాడు మండలం దొడ్డదేవరపాడు – జిల్లా పరిషత్ హైస్కూల్, 571 మార్కులు.

పల్లె పోగు వినీల – చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామం గురుకుల పాఠశాల, 567 మార్కులు.

నారిశెట్టి జగదీష్ ఆదిత్య – చందర్లపాడు జిల్లా పరిషత్ హైస్కూల్, 559 మార్కులు.

ఉప్పులూరి సోనీ ప్రియా – నందిగామ పట్టణం అనాసాగరం గ్రామం జిల్లా పరిషత్ హైస్కూల్, 549 మార్కులు.

ఈ విద్యార్థులంతా బడుగు, బలహీన వర్గాలకు చెందినవారు. వారి తల్లిదండ్రులు రోజువారీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న సామాన్యులు. సాధారణంగా బస్సు, కారు లేదా రైలు ప్రయాణాలకు మాత్రమే అలవాటు పడిన వీరికి విమాన ప్రయాణం ఒక కల. ఆ కలను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారు ‘కలలకు రెక్కలు’ కార్యక్రమం ద్వారా నెరవేర్చారు. విద్యలో పెను మార్పులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు విద్యా రంగంలో తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పులు ఫలితాలను ఇస్తున్నాయని ఎమ్మెల్యే సౌమ్య గారు తెలిపారు. గత సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా 10వ తరగతి ఫలితాలు 81.14 శాతం ఉండగా, ఈ సంవత్సరం 85.25 శాతానికి చేరాయి. నందిగామ నియోజకవర్గంలోనూ గత సంవత్సరం 74.80 శాతం నుంచి ఈ సంవత్సరం 80.08 శాతానికి పెరిగింది. విద్యా మంత్రి నారా లోకేష్ సారధ్యంలో ఉపాధ్యాయులకు సింగపూర్ విదేశీ పర్యటనలు, విద్యార్థులకు ఇలాంటి ప్రోత్సాహక కార్యక్రమాలు విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని ఆమె అన్నారు.

గురువులు, తల్లిదండ్రుల స్ఫూర్తి

విద్యార్థుల విజయం వెనుక తల్లిదండ్రుల కష్టం, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం కీలకమని ఎమ్మెల్యే సౌమ్య గారు పేర్కొన్నారు. ఈ విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించడమే కాకుండా, వారిలో ఆత్మవిశ్వాసాన్ని, కలలు సాకారం చేసుకునే స్ఫూర్తిని నింపుతుందని అందరూ ఆశా భావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు,విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు, కూటమి నేతలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
బీజేపీ లో కుడా క్రమశిక్షణ లేని నాయకులు,పుత్ర రత్నాలు ఉన్నారంటే ఇనుముకు చెద పట్టినట్టే......
భార్య పుస్తెలు అమ్మి ఎన్నికల్లో పోటీ చేశానంటూ బండి సంజయ్ సిగ్గులేకుండా దగుల్బాజీ కబుర్లు...
By Ponnala Srinivasrao 2026-05-10 01:52:56 0 159
Rajasthan
Tourism Infrastructure and Heritage Conservation Growth
Rajasthan is enhancing its tourism sector through significant investments in infrastructure...
By Fathima Safa 2026-06-23 10:40:27 0 136
Andhra Pradesh
ఇటీవల చేపల వేటకు వెళ్లి మృతి చెందిన గిరిజన కుటుంబాలకు నార లోకేష్ భరోసా!
ఈరోజు మెగా పేరెంట్స్ మీటింగ్ 4.0 కార్యక్రమం కోసం పోలవరం జిల్లా కేంద్రం అయిన రంపచోడవరం లో...
By Shyamala Yadagiri 2026-07-24 17:52:55 0 140
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం కొత్తూరు మురళి: రైతులకు అపార నష్టం కలిగిస్తున్న ఒంటరి ఏనుగు
మండలం, పాలెం పంచాయతీలో శనివారం ఒంటరి ఏనుగు దాడిలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. బాధితులైన...
By Kothuru Murali 2026-05-16 15:54:49 0 145
Andhra Pradesh
పుంగనూరు: బీసీ గళం సభకు హాజరైన పెద్దిరెడ్డి
అనంతపురం జిల్లాలో ఆదివారం జరిగిన బీసీ గళం సభకు పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి...
By Kothuru Murali 2026-04-26 10:59:50 0 151
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com