నిమ్మలపల్లెలో ఐపీఎల్ బెట్టింగ్ ముఠా అరెస్ట్.

0
136

చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురు యువకులను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. పిట్టావాండ్లపల్లి మూడు రోడ్ల కూడలి వద్ద చెన్నై సూపర్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మ్యాచ్‌పై ఆన్‌లైన్, నగదు రూపంలో బెట్టింగ్ కాస్తున్నట్లు సమాచారం. వారి వద్ద నుంచి రూ. 3,59,700 నగదు, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో ఏడుగురు పరారీలో ఉండగా, వారి కోసం గాలింపు కొనసాగుతోంది. నిందితులపై కేసులు నమోదు చేశారు. బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని ఎస్పీ ధీరజ్ హెచ్చరించారు.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
మే డే సందర్భంగా కార్మికులు, కర్షకులు, శ్రామికులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. సమాజ నిర్మాణంలో మీ...
By Sadaq Sadaq 2026-05-01 07:22:44 0 175
Andhra Pradesh
పుంగనూరు:బోయకొండ గంగమ్మను దర్శించుకున్న పోలీసు ఉన్నతాధికారులు.
శుక్రవారం, చౌడేపల్లి మండలం, దిగువపల్లిలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయాన్ని అన్నమయ్య జిల్లా డి ఐ జి...
By Kothuru Murali 2026-01-30 11:43:10 0 221
Andhra Pradesh
మదనపల్లెలో కిడ్నీ రాకెట్ కేసు.......... మరో అరెస్టు
మదనపల్లెలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు మరో నిందితుడిని ఆదివారం అరెస్ట్...
By Pagadala Venkateswar 2026-04-20 03:34:26 0 139
Telangana
ఇక నుంచి చెరువుమాదారం లో PHC సేవలు అందుబాటు
జిల్లా కలెక్టర్ ఆదేశాలతో చెరువుమాదారం గ్రామానికి PHC తరలింపు చేశారు.కాగా ఇక నుంచి డాక్టర్లు రోజు...
By Krishna Balina 2026-01-08 09:39:31 0 256
Telangana
జూనియర్ సివిల్ జడ్జి గ ఎంపికైన ఏకారి లిఖిత కి అభినందనలు తెలిపిన రఘునాథ్ వెర్రబెల్లి
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ శ్రీరాంపూర్ అరుణక్కనగర్ కి చెందిన ఏకారి లిఖిత  ఆంధ్ర ప్రదేశ్...
By Avunoori Mahesh 2026-04-12 07:09:57 0 217
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com