0
Comments
197
Views
తెలంగాణ నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్ తన తల్లిని ఉద్దేశించి భావోద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తన తల్లిని కలిసి ఆమె ఆశీస్సులు తీసుకున్న ఆయన, ఈ సందర్భంగా తన మనసులోని మాటలను పంచుకున్నారు. తన తల్లి గత నవంబర్ నుంచి జనవరి వరకు తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డారని, ఆ సమయంలో ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉండేదని గుర్తుచేసుకున్నారు.
ప్రస్తుతం అమ్మ ఆరోగ్యం మెరుగైంది, కానీ ఇంకా మంచానికే పరిమితమయ్యారు. తన కొడుకును ఈ రాష్ట్రానికి డీజీపీగా చూడాలన్న ఆమె బలమైన కోరికే, అనారోగ్యం నుంచి ఆమెను బయటపడేసిందని నేను బలంగా నమ్ముతున్నాను" అని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. డీజీపీగా తన నియామకం గురించి తెలిసి తన తల్లి ఎంతో ఆనందపడ్డారని, ఆమె సంతోషం చూసి తానూ ఉప్పొంగిపోయానని వివరించారు.