సీనియర్ నేత, వి హనుమంతరావుకు ప్రభుత్వ బిసి సంక్షేమ శాఖ సలహాదారులు పదవి

0
165

సీనియర్ నేత, కాంగ్రెస్ పార్టీలో బిసి అగ్ర నాయకుడు వి. హనుమంతరావుకు ప్రభుత్వ బిసి సంక్షేమ శాఖ సలహాదారులు పదవి లభించింది! సీనియర్ నేతగా అయన ఓపికకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అండగా ఉండి నేనున్నా అంటూ ఇచ్చిన భరోసాకు నజరానా అని చెప్పుకోవచ్చు! 

‎వి. హనుమంతరావు ఆషామాషి నేత కాదు. ఎన్టీఆర్ హయాంలోనే పిసిసి నేతగా కాంగ్రెస్ ప్రచార రధంపై పోటా పోటీగా ప్రచారం నిర్వహించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఉర్రూతలూగించిన మాస్ నాయకుడు! ఆయన మాట తీరు ప్రేమతో నిండి ఉంటుంది! విలక్షణంగా ఉంటుంది! ముఖ్యంగా పేదల పక్షపాతి! ఎవరు వెళ్లినా "ఏందిరా భయ్" అంటూ ఆప్యాయంగా పిలవడం, సంబంధిత అధికారులకు ఫోన్ కలిపి విషయం చెప్పి సమస్య పరిష్కారం చూపించడం ఆయన స్టయిల్! ఆయనతో కాకుంటే "ఇది నాతో కాదురా భయ్" అని ఖుల్లం ఖుల్లా గా చెప్పేస్తారు! 

‎హనుమంతరావుకు రాష్ట్ర మంత్రిగా సేవలు అందించాలనే కోరిక! కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి లాంటి నేతలు ఆయన డామినేషన్ తట్టుకోలేక ఎంపిగా పంపించే వారు! ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ సోనియా గాంధీలను నేరుగా కలిసేంత చనువు ఉందని, సీనియర్ నేతగా ఆయన్ని పార్టీలో గౌరవిస్తారని ఆయనే స్వయంగా చెప్పి సంతోషం వ్యక్తం చేశారు ఒకసారి! ఆయన అల్ప సంతోషి! పెద్ద పెద్ద పదవులు ఆశించింది లేదు! అవి వెతుక్కుంటూ వచ్చాయని చెప్పారు. ఎప్పుడూ ప్రజల్లో ఉండటం, వార్తల్లో ఉండటం ఆయనకు ఇష్టం! 

‎రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు సెబ్బాష్ రెడ్డీ, నీ వల్లే తెలంగాణ లో అధికారంలోకి వచ్చాం అని మొదట గొంతు విప్పి అభినందించిన తొలి అగ్ర నేత కూడా హనుమంతరావు అనే చెప్పాలి! మొన్న గాక నిన్న వచ్చిన చాలా మంది సీనియర్లు మొఖాలు మాడ్చుకున్నా హనుమంతరావు మాత్రం ఎప్పటికప్పుడు గాంధీ భవన్ లో ప్రెస్ మీట్లు పెట్టి సమర్థించుకుంటూ వచ్చారు! రేవంత్ రెడ్డి సైతం ఎంతో గౌరవిస్తూ హనుమంతరావుకు గుండె లాంటి బతుకమ్మ కుంటను అందంగా తీర్చిదిద్ది ఏకంగా హనుమంతరావు పేరు పెట్టి కృతజ్ఞత సమర్పించుకున్నారు. అధిష్టానం కూడా హనుమంతరావును బాగా చూసుకోండి అని చెప్పడంతో ఇప్పుడు క్యాబినెట్ ర్యాంక్ తో ప్రభుత్వ సలహాదారులుగా నియమించారు. హనుమంతరావు రేవంత్ రెడ్డికి కొండంత భరోసా! ఆయన మాట గొప్ప అండ అంతే! 

Search
Categories
Read More
SURAKSHA
. Community Policing and Public Awareness
​Content: Karnataka Police goes beyond just law enforcement by connecting with the public through...
By Kalaga Sailaja 2026-06-29 11:24:01 0 172
Andhra Pradesh
ఇంస్టాగ్రామ్ మీ షో వర్క్ ఫ్రొం హోమ్ శాలరీ 30000 అప్లై నౌ సైబర్ మోసాలు
హౌస్ వైఫ్ చదువు రానివారు తెలిసి తెలియని ఆడపిల్లలు తస్మాత్ జాగ్రత్త ఇలాంటి సైబర్ నేరాలు బారిన...
By Rajini Kumari 2025-12-26 06:11:22 0 267
Telangana
కరీంనగర్ : తండ్రిని గొడ్డలితో నరికి చంపిన కుమారుడు...!
కరీంనగర్ పట్టణం ముకురాంపురం ఆరెల్లి మల్లేష్ అనే వ్యక్తి తన తండ్రి ఆరెల్లి నరసయ్య గొడ్డలితో నరికి...
By Sunka Santhosh 2026-05-16 07:27:39 0 168
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలోకి చేరికలు
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, చీకల చేను గ్రామానికి చెందిన పలు టీడీపీ కుటుంబాలు గురువారం...
By Kothuru Murali 2026-03-06 11:26:17 0 206
Andhra Pradesh
స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ పేరిట రిటైర్డ్ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ భార్య నుంచి 2.58 కోట్లు కాజేసిన కేటుగాళ్లు
✒️- స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ పేరిట రిటైర్డ్ ఐపీఎస్ జేడీ లక్ష్మీనారాయణ భార్య నుంచి రూ.2.58...
By Rajini Kumari 2026-01-11 11:24:25 0 221
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com