మైక్రో ఫైనాన్స్ పేరుతో అమాయక గిరిజనుల నుంచి వసూలు చేసిన కోట్ల రూపాయలను ఏం చేశారు?

0
173

‎సింగర్ మంగ్లీ కేసులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని సింగర్ మంగ్లీ చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. బాధితులను చూస్తే జాలేస్తుందని, వారి తరపున ఫైట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెబుతున్న మంగ్లీ.. కావాలని ఈ కేసులో తనని, తన తమ్ముడు శివ చౌహాన్‌ను ఇబ్బంది పెడుతున్నారంటూ మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుని మరీ ప్రకటించారు. ఇదిలా ఉంటే, ఇప్పుడీ కేసులో అసలైన టర్నింగ్ పాయింట్‌ని పోలీసులు కనిపెట్టారు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రమావత్ మధు అకౌంట్ నుంచి మంగ్లీ సోదరుడి అకౌంట్‌కు మనీ ట్రాన్స్‌ఫర్ అయినట్లుగా పోలీసులు గుర్తించడంతో.. కేసులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

‎ఇప్పటి వరకు రమావత్ మధు అకౌంట్ నుంచి మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ అకౌంట్‌కు మూడు సార్లు భారీగా మనీ ట్రాన్స్‌ఫర్ జరిగిందని, అకౌంట్‌లో మనీ పడిన రోజే విత్‌ డ్రా చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. దీంతో పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో రమావత్ మధు అకౌంట్‌ను సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగం సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. అంతకు ముందు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి అకౌంట్స్ వివరాలు కావాలని బ్యాంకులకు పోలీసులు లేఖ రాశారు. రమావత్ అకౌంట్ నుంచి శివ చౌహాన్ అకౌంట్‌కు మనీ ట్రాన్స్‌ఫర్ జరిగినట్లుగా గుర్తించిన పోలీసులు.. ఇప్పుడు సింగర్ మంగ్లీ అకౌంట్స్‌‌ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాలనే నిర్ణయం తీసుకోవడంతో..ఈ మైక్రో ఫైనాన్స్ కేసు మరింత ఆసక్తికరంగా మారింది.

‎మైక్రో ఫైనాన్స్ పేరుతో అమాయక గిరిజనుల నుంచి వసూలు చేసిన కోట్ల రూపాయలను ఏం చేశారు? ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది? వీళ్లేనా.. లేదంటే ఇంకా పెద్ద తలకాయలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులకు టర్నింగ్ పాయింట్ దొరికేసింది కాబట్టి.. త్వరలోనే ఈ కేసును వారు క్లోజ్ చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో తెరపైకి ఎవరెవరి పేర్లు వస్తాయనేది? తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. అలాగే, తమ్ముడు శివ చౌహాన్ అకౌంట్‌లో జరిగిన లావాదేవీలపై సింగర్ మంగ్లీ.. ఎలా రియాక్ట్ అవుతారు? అనేది కూడా చూడాల్సి ఉంది

Search
Categories
Read More
Andhra Pradesh
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాలు...
By Kothuru Murali 2026-01-07 02:41:47 0 334
Telangana
గృహజ్యోతికి దరఖాస్తు చేసుకోవాలి: కడెం ఏఈ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన విద్యుత్ గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకోవాలని...
By Mittapelli Saketh 2026-01-10 04:21:05 0 626
Andhra Pradesh
Shani Jagan Takes control of Rayalaseema
He is the one and only worst political person. In Rayalaseema . He had pre closed all the works...
By Terli Ashok 2026-01-06 12:26:53 2 836
Andhra Pradesh
కాలువపై శివాజీ విగ్రహం ఏర్పాటు సబబు కాదు: వాల్మీకి సంఘాల.
మదనపల్లె బహుదా కాలువపై ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడం సబబు కాదని వాల్మీకి సంఘాల నాయకులు...
By Pagadala Venkateswar 2026-06-27 05:49:34 0 89
Telangana
ఈటల సమక్షంలో బీజేపీలోకి చేరికలు.|
● ఈటల రాజేందర్ సమక్షంలో సుమారు 50 మంది చేరిక ● బోడుప్పల్ అభివృద్ధి కోసం బీజేపీతో కలిసి...
By Sidhu Maroju 2026-08-30 09:07:22 0 104
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com