బంగారు బాబు గుట్టురట్టు.. ఒంటి నిండా రోల్డ్ గోల్డ్!

0
272

ఒంటి నిండా భారీ బంగారు ఆభరణాలతో జిగేల్‌మని మెరిసే గోల్డ్‌ మ్యాన్‌పై ఐటీ అధికారుల కన్ను పడింది. గోల్డ్ మ్యాన్‌గా పిలిచే సూర్యా భాయ్ ఎక్కడికెళ్లిన ఒంటి నిండా బంగారంతో కనువిందు చేస్తూ ఉంటాడు. హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన ఈ సూర్యా భాయ్ ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆలయం వెలుపల మీడియాకు ఒంటి నిండా బంగారంతో కనిపించాడు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పైగా అంత బంగారం ఒంటిపై ధరించి ఏమాత్రం భయం లేకుండా జనాల్లోకి వస్తున్న సూర్యాభాయ్‌తో ఫొటోలు దిగేందుకు జనాలు ఎగబడుతుంటారు. బాబు చాలా రిచ్చని అందరూ అనుకునే వారు

‎అసలే బంగారం ధరలు ముట్టుకుంటే సుర్రుమనేలా ఉంటే.. ఇతగాడు ఒంటి మీద కేజీలకు కేజీలు గోల్డ్‌ ఎలా ధరిస్తున్నాడో, అంత ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో ఆరా తీయగా అసలు గట్టు బయటపడింది. మెరిసేందంతా బంగారం కాదన్నట్లు మనోడి ఒంటిపై ఉన్న బంగారం కూడా అసలైంది కాదని తెలుసుకుని ఐటీ అధికారులు నాలుక కరచుకున్నారు. ఫేక్ గోల్డ్ మ్యాన్ అసలు పేరు పల్లాపు సురేష్ కుమార్ (34). హైదరాబాద్‌లోని అత్తాపూర్‌కు చెందిన సూర్య భాయ్‌ అలియాస్‌ పల్లపు సురేశ్‌కుమార్‌ ధరించే నగల్లో మెరుపు తప్ప, అసలు బంగారం లేదని తేలింది.

‎హైదరాబాద్‌ శేరి లింగంపల్లికి చెందిన కొండా విజయ్‌ కుమార్‌ అలియాస్‌ బంగారు బాబు ఇటీవల ఢిల్లీ విమానాశ్రయంలో 1.4 కిలోల బంగారంతో అధికారులకు పట్టుబడ్డాడు. దర్యాప్తులో పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అధికారులు రూ. 2.3 కోట్ల విలువైన 1.4 కిలోల ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కొండా విజయ్‌ కుమార్‌ కేసులో సూర్యాభాయ్‌ గురించి సమాచారం ఐటీ అధికారులకు అందింది. అతడి సెల్‌ఫోన్‌లో సూర్యాభాయ్‌ ఫోన్‌ నంబర్, ఫొటోలు గుర్తించి హైదరాబాద్‌ ఐటీ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో ఐటీ విచారణకు హాజరైన సూర్యాభాయ్‌ సుమారు రూ.1 కోటి విలువైన 12 రకాల ఆభరణాలు ధరించి వచ్చాడు. ఈ క్రమంలో అధికారుల ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చిన అధికారులు ఆభరణాలను పరీక్షించారు. దీంతో అతగాడు ధరించనవన్నీ రోల్డ్‌ గోల్డ్‌ అని, ఆ నగలు కేవలం రూ.3 లక్షల విలువైనవిగా తేల్చారు.

రాగి, వెండిపై గోల్డ్‌ కోటింగ్‌ వేసుకుని బంగారం అని ఫోజులు కొడుతున్నట్లు గుర్తించారు. ఇలాంటివి దాదాపు 32 సెట్లు సూర్యాభాయ్‌ వద్ద ఉన్నట్లు గుర్తించారు. కనీసం అతడికి సొంత ఇళ్లు కూడా లేదని, నెలకు రూ. 20,000 అద్దె ఇంట్లో నివసిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిజమైన బంగారమని చెప్పుకుని ఈ నగలను ధరించి యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ పాపులర్ అయిన సూర్యా భాయ్ అసలు బిజినెస్ చికెన్ షాప్. చికెన్ షాప్తో పాటు జిమ్ ట్రైనర్గా కూడా పని చేస్తుంటారు. ఇలా వచ్చిన డబ్బుతో నెలకు రూ.20 వేలు అద్దె కడుతూ లగ్జరీ లైఫ్ బతుకుతున్నాడు. ప్రమోషన్స్, యూట్యూబ్ ఇంటర్వ్యూలు, పలు చిన్న సినిమాల్లోనూ నటించి బాగానే కూడబెట్టాడు. ల్యాండ్ సెటిల్మెంట్స్ చేస్తూ థార్, సఫారీ, ఎండీవర్, బుల్లెట్ మోటార్‌ బైక్‌లు కొన్నాడు.

Search
Categories
Read More
BMA
SLAPP Lawsuits: Weaponizing Courts to Silence Media
Wealthy individuals and massive corporations are increasingly weaponizing the legal system to...
By JoinBMA 2026-08-19 10:00:46 0 73
Andhra Pradesh
మదనపల్లెలో తాగునీటి సమస్యకు బోరుతో పరిష్కారం.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే షాజహాన్ భాష ఆదేశాల మేరకు...
By Pagadala Venkateswar 2026-07-01 07:01:20 0 103
PRAGATI
Affiliations with BMA: Powering a Nation Through Media Partnerships 🤝
🤝 Affiliations with BMA: Powering a Nation Through Media Partnerships In a country as diverse...
By PRAGATI 2025-04-30 10:38:27 0 4K
Telangana
నేలకొండపల్లిలో ప్రమాదం.. ఆరుగురు యువకులకు గాయాలు...
శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక కారును తప్పించబోయి రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా...
By Krishna Balina 2026-03-06 09:58:52 0 461
Andhra Pradesh
గుంటూరులో మున్సిపల్ కార్మికుల ధర్నా
మునిసిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర కార్యదర్శి...
By John Baji 2025-12-29 10:06:10 0 229
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com