ఇంటర్నేషనల్ ఫిష్ పాండ్ గూడెం సత్యనారాయణ స్వామి ఆలయాభివృధికి నిధులు మంజూరు : ఎంమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

0
267

మంచిర్యాల జిల్లా : ఈరోజు మంచిర్యాల ఎమ్మెల్యే  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే  మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటి ఇంటర్ నేషనల్ ఫిష్ పాండ్ మనకే వచ్చిందని చెప్పారు .. దీనితో మత్స్య సంపద అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయని చేపల విత్తన ఉత్పత్తి కూడా ఇక్కడనే చేయడం జరుగుతుందని, రాష్ట్రంలోని వివిధ చెరువులకు మత్స్య విత్తనాలను ఇక్కడి నుంచే సరఫరా చేయడం జరుగుతుందన్నారు. 

ఈ కార్యక్రమం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆమోదం తెలపడం జరిగిందన్నారు..

 దండేపల్లి మండలంలోని గూడెం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని 70 కోట్ల రూపాయలతో రెండవ అన్నవరంగా అభివృద్ధి చేయడానికి నిధులు మంజూరు అయ్యాయని త్వరలో పనులు ప్రారంభించి పుష్కరాల కన్నా ముందుగానే పూర్తి చేస్తామని చెప్పారు, గూడెం పైప్ లైన్ మరమ్మత్తులు చేపించాము, మోటార్ 10 నిమిషాలు కూడా బంద్ కాలేదన్నారు, అదే వాళ్ల హయాంలో తరచూ పైప్స్ పగిలేవని అన్నారు.

అలాగే పుష్కరాల సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ ఆలయానికి 10 కోట్లతో అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. 

జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా నైనా ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తునామన్నారు, రైతులకు సరిపోయే కరెంటు ఇస్తున్నామన్నారు, ప్రతిపక్ష నాయకుల మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.

ఇంటర్ నేషనల్ ఫిష్ పాండ్ మరియు గూడెం సత్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధికి, మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ్ ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి కి, రాష్ట్ర మంత్రుల బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు..

ఈ సమావేశంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్ , డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్ , కార్పొరేటర్లు , కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు..

Search
Categories
Read More
Andhra Pradesh
రేపు ముఖ్యమంత్రి గారి పర్యటనకు పటిష్టమైన మందబోస్తే ఏర్పాట్లు చేసిన మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారు
రేపు ముఖ్యమంత్రి గారి పర్యటనకు పటిష్టమైన బందోబస్త్ ఏర్పాట్లు చేసిన మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ...
By Chennaiah Kati 2026-06-26 16:40:16 0 114
Telangana
బి ఆర్ ఎస్ సభను ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం చెక్ పెట్టడం జరిగింది....
   వరంగల్: వావ్ ఏం ప్లాన్ చేశారు...  భారత్ అవాజ్ న్యూస్: వరంగల్ లోని 6 తేదీన...
By Gujile Ramu 2026-05-05 02:43:58 0 188
Chandigarh
Power Tariff Hike Proposed in Chandigarh After 81 Cr Revenue Deficit
Just five months after taking over electricity distribution in Chandigarh, the private firm CPDL...
By Bharat Aawaz 2025-07-17 06:05:48 0 3K
Rajasthan
Rajasthan Strengthens Agriculture and Farmer Welfare
Rajasthan continues to prioritize agriculture and farmer welfare through initiatives that improve...
By Fathima Safa 2026-07-06 08:36:27 0 196
Andhra Pradesh
సోమల మండలంలో యోగ వారోత్సవాలు ప్రారంభం
అన్నమయ్య జిల్లా, సోమల మండలం, దుర్గం కొండ వద్ద ఆదివారం యోగా కార్యక్రమం, ట్రెక్కింగ్ నిర్వహించారు....
By Kothuru Murali 2026-06-08 14:24:14 0 113
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com