నేడు ఏపీ కేబినెట్ భేటీ .. ఈ కీలక అంశాలపై చర్చ.

0
131

అమరావతిలో రూ.1,208 కోట్ల ట్విన్ టవర్ల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపే అవకాశం

సచివాలయం, అసెంబ్లీ భవనాల పనులకు పరిపాలన అనుమతులకు నిర్ణయం

పలు సంస్థలకు భూ కేటాయింపులు, రైతులకు కౌలు పెంపుపై చర్చ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు ఉదయం 10.30 గంటలకు వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ప్రధానంగా రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేయనున్నారు. నిలిచిపోయిన నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించి, పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకోనుంది.

 

సమావేశం అజెండాలో అత్యంత కీలకమైనది అమరావతి క్వాంటం వ్యాలీలో రూ.1,208.41 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 'ట్విన్ టవర్ల' ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. దీంతో పాటు సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల టవర్ల ఫేకేడ్, గ్లాజింగ్ పనులకు (రూ.2,540 కోట్లు), అసెంబ్లీ భవన నిర్మాణ పనులకు (రూ.798 కోట్లు) కూడా ఆమోదం తెలపనున్నారు.

 

అలాగే, సెబీ, స్వామి నారాయణ్ గురుకుల్, డీఏవీ స్కూల్ వంటి పలు సంస్థలకు భూ కేటాయింపుల ప్రతిపాదనలను కూడా మంత్రివర్గం ఆమోదించనుంది. భూసమీకరణ కింద భూములిచ్చిన రైతులకు మెట్ట భూమికి రూ.40,000, జరీబు భూమికి రూ.60,000 చొప్పున వార్షిక కౌలు పెంచే అంశం కూడా అజెండాలో ఉన్నట్లు సమాచారం.

Search
Categories
Read More
Andhra Pradesh
క్రిస్మస్ వేడుకలకు ఆహ్వానించిన పోతిన మహేష్ అండ్ టీం చార్లెస్ పిజా కబ్
మనకు ఎన్ని శక్తి సామర్థ్యాలు ఉన్న దానికి ఒక పరిమితి ఉంటుంది ఆ పరిమితిలోకి భగవంతుని...
By Rajini Kumari 2025-12-25 11:15:30 0 292
Telangana
"పవన్ కల్యాణ్ సభకు షాక్.. అనుమతి నిరాకరించిన తెలంగాణ పోలీసులు"|
హైదరాబాద్ : ఏపి. ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు, పవన్ కళ్యాణ్  హైదరాబాద్ లో ...
By Sidhu Maroju 2026-06-01 14:07:15 0 413
Andhra Pradesh
ఇక బరువు తగ్గొద్దు లోకేశ్.. ప్రధాని మోదీ సరదా సూచన!
హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ప్రధాని మోదీకి తేనీటి విందు ఫిట్‌నెస్ విషయంలో మోదీయే...
By Pagadala Venkateswar 2026-05-11 02:45:06 0 131
Andhra Pradesh
సూర్య, శాంసన్ కాదు.. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా కొంపముంచేది ఇతనే..! ముందే ఓటమిని శాసించిన విలన్
Team India T20I World Cup 2026 Squad: న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను టీం ఇండియా...
By SivaNagendra Annapareddy 2026-01-20 08:20:42 0 662
Andhra Pradesh
చీరాలలో రహదారి భద్రతపై శక్తి టీం భారీ అవగాహన
చీరాల పట్టణంలోని వాహనదారులు రహదారి నిబంధనలు పాటిస్తూ ప్రమాద రహిత సమాజానికి సహకరించాలని చీరాల సబ్...
By Vadlamudi NagaVenkat 2026-04-03 10:09:29 0 420
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com