ధాన్యం కొనుగోళ్ల లో వేగం పెంచండి, రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలి, జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరిష్,

0
1K

మహబూబాబాద్,ఏప్రిల్ 29: జిల్లా కలెక్టర్ సీరోలు మండలం ఉప్పరిగూడెం, కాంపల్లి, కురవి మండలలో కొనసాగుతున్న దాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు, జిల్లా వ్యాప్తంగా సహకార శాఖ 150, ఐకెపి 50,  గిరిజన కార్పొరేషన్ 8,  మెప్మా 1, శాఖల ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన మొత్తం ( 209 ) కేంద్రాల నుండి రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని సేకరించడం జరుగుతుందని, ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 3934.860 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు,అకాల వర్షాలు రానున్న నేపథ్యంలో రైతులను అప్రమత్తం చేయాలని టార్పాలిన్లు సిద్ధంగా ఉంచుకోవాలని కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు.ప్రభుత్వం సూచించిన ప్రకారం మ్యాచర్ వచ్చే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని, ధాన్యం కేంద్రాల వద్ద త్రాగునీరు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, రవాణా చేయు విషయంలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాహనాలను సిద్ధం చేయాలని, గన్ని సంచులు, మ్యాచ్చర్ మిషన్లు, ప్యాడి క్లీనర్లు, టార్పాలిన్లు, టెంట్లు, చేర్లు, తదితర అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు.కొనుగోళ్లు చేసిన దాన్యంకు సంబంధించి రైతుల ఖాతా వివరాలను సేకరించి ఆన్లైన్లో నమోదు చేసి డబ్బులు త్వరగా పడే విధంగా సంబంధిత సెంటర్ నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ పర్యటనలో కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ రెవెన్యూ కె. అనిల్ కుమార్, సివిల్ సప్లై అధికారి రమేష్, మేనేజర్ సివిల్ సప్లై నరసింహరావు, సంబంధిత నిర్వాహకులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
పెద్దపల్లి : చెట్టును ఢీకొన్న కారు
ఎర్రగుంట్లపల్లి గ్రామ శివారులో గురువారం కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ధర్మారం మండలం...
By Sunka Santhosh 2026-07-30 14:08:42 0 204
Telangana
నిజామాబాద్. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR)
SIR ప్రక్రియలో భాగంగా 21వ డివిజన్‌లో నిర్వహించిన BLOలు, BLAల సమీక్ష సమావేశంలో ముఖ్య...
By Sadaq Sadaq 2026-07-25 14:13:14 0 151
Andhra Pradesh
పేద విద్యార్థుల కోసం దాతలు ముందుకు రావాలి: విద్యాంజలి.
ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థుల అభివృద్ధికి దాతలు 'విద్యాంజలి' కార్యక్రమంలో భాగస్వాములు...
By Pagadala Venkateswar 2026-02-18 10:38:28 0 205
Telangana
నిజామాబాద్: పెట్రోల్ బంక్ లో బారులుతిరిన జానాo
నిజామాబాద్: పెట్రోల్ బంకులు బంద్  అనాడoథోప్రెట్రోల్ బంకులో బారులుతిరినజనం 
By Sadaq Sadaq 2026-03-24 18:25:03 0 193
Andhra Pradesh
ఇంద్రకీలాద్రిపై భక్తుల సౌకర్యార్థం నూతన సంస్కరణలు ఆలయ కమిటీ
ప్రకటన: ఇంద్రకీలాద్రిపై భక్తుల సౌకర్యార్థం నూతన సంస్కరణలు          ...
By Rajini Kumari 2025-12-30 10:46:20 0 261
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com