దేశంలోనే తొలి టెలి-రోబోటిక్ సర్జరీ చేసిన నారాయణ-జీఎస్ఎల్ ఆసుపత్రులు.. చంద్రబాబు అభినందన.

0
152

టెక్నాలజీతో నాణ్యమైన వైద్యసేవలు

వందల కిలో మీటర్ల దూరం నుంచి అందుబాటులోకి స్పెషలిస్టుల సేవలు

ఈ సాంకేతికత భవిష్యత్తులో వైద్య సేవల రూపురేఖలను పూర్తిగా మార్చేస్తుందన్న చంద్రబాబు

టెక్నాలజీని సమర్థంగా వినియోగిస్తే వైద్య సేవలను ప్రజలకు మరింత సులభతరం చేయవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈరోజు క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబును నారాయణ మెడికల్ కాలేజీ-ఆసుపత్రులు, జీఎస్ఎల్ మెడికల్ కాలేజీ-ఆసుపత్రుల యజమాన్యాలకు చెందిన ప్రతినిధులు కలిశారు. ఇటీవల తమ రెండు ఆసుపత్రులు కలిసి టెలి-రోబోటిక్ సర్జరీ నిర్వహించినట్టు సీఎం చంద్రబాబు దృష్టికి తెచ్చారు. టెలి-రోబోటిక్ సర్జరీ జరిగిన తీరును ఆయా మెడికల్ సంస్థల యాజమాన్యాలకు చెందిన ప్రతినిధులు సింధూర, గన్ని భాస్కరరావు సీఎంకు వివరించారు. 

 

నెల్లూరులోని నారాయణ హాస్పిటల్‌లో ఉన్న రోగికి రాజమండ్రి జీఎస్‌ఎల్ ఆసుపత్రి వైద్యులు రోబో ద్వారా సర్జరీ చేశానని... అలాగే జీఎస్‌ఎల్‌లో ఉన్న రోగికి నారాయణ ఆసుపత్రి వైద్యులు దూరం నుంచే శస్త్రచికిత్స నిర్వహించారని తెలిపారు. దేశంలోనే తొలిసారి ఈ తరహా సర్జరీ నిర్వహించినట్టు వెల్లడించారు. 

 

ఈ సందర్భంగా రెండు ఆసుపత్రుల యజమాన్యాలను చంద్రబాబు అభినందించారు. టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే దూరంగా ఉన్నా సరే నాణ్యమైన వైద్య సేవలు అందించవచ్చని ఈ సంస్థలు నిరూపించాయని సీఎం అన్నారు. రెండు రోజుల వ్యవధిలో నాలుగు సర్జరీలను విజయవంతంగా పూర్తి చేయడం విశేషమన్నారు. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న రోగులకు కూడా ఆయా రంగాల్లో నైపుణ్యం సాధించిన డాక్టర్లు ఎక్కడి నుంచైనా సర్జరీ చేయగలిగే ఈ సాంకేతికత భవిష్యత్తులో వైద్య సేవల రూపురేఖలను పూర్తిగా మార్చేస్తుందని సీఎం పేర్కొన్నారు.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
రైతన్న సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం - ఎమ్మెల్యే నరేంద్ర వర్మ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రైతన్నా మీకోసం వారోత్సవాలు’ కార్యక్రమంలో...
By Vadlamudi NagaVenkat 2026-03-17 18:05:33 0 933
SURAKSHA
డిజిటల్ పౌరులుగా బాధ్యతాయుతంగా ప్రవర్తించడం మన కర్తవ్యం
డిజిటల్ ప్రపంచం అపారమైన అవకాశాలను కల్పిస్తున్నప్పటికీ, అది బాధ్యతలతో కూడినదని గుర్తుంచుకోవాలి....
By Kalaga Sailaja 2026-06-24 09:29:46 0 110
Andhra Pradesh
​కూటమి పాలనలో గ్రంథాలయాలకు పూర్వవైభవం: వి. ఆర్ రాసాని.
ఆదివారం మదనపల్లి ప్రధాన శాఖ గ్రంథాలయాన్ని సందర్శించిన ఏపీ గ్రంథాలయ పరిషత్ సభ్యులు డాక్టర్ వి. ఆర్...
By Pagadala Venkateswar 2026-06-08 09:23:30 0 112
Telangana
నూతన రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : అల్వాల్‌ వెంకటాపురం డివిజన్‌లో రూ.50 లక్షల వ్యయంతో సీసీ...
By Sidhu Maroju 2025-11-28 05:22:34 0 243
BMA
Rise of Citizen News: Digital Creators Inform India
With public trust in traditional newsrooms falling to 39 percent, Indian citizens are...
By JoinBMA 2026-08-20 06:02:34 0 217
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com