అన్నమయ్య జిల్లా: డ్రోన్ నిఘాతో అసాంఘిక కార్యకలాపాలకు చెక్.
Posted 2026-04-28 03:46:48
0
130
అన్నమయ్య జిల్లాలో శాంతిభద్రతలను బలోపేతం చేసేందుకు పోలీసులు సోమవారం నూతన చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు, పట్టణ శివారు ప్రాంతాలు, కొండలు, గుట్టలు, నిర్మానుష్య ప్రాంతాలపై డ్రోన్ కెమెరాలతో నిఘా పెంచారు. పోలీసు వాహనాలు వెళ్లలేని చోట్ల కూడా గగనతలం నుంచి పర్యవేక్షిస్తూ పేకాట శిబిరాలు, నాటుసారా తయారీ, గంజాయి రవాణా వంటి అక్రమ కార్యకలాపాలను గుర్తిస్తున్నారు. అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలో ఎక్కడ దాక్కున్నా నేరస్తులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
.బోయకొండ గంగమ్మను దర్శించుకున్న పెద్దిరెడ్డి
సోమవారం, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లె మండలం, దిగువపల్లిలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో...
మెగా డిఎస్సి పై విషప్రచారాన్ని వైసీపీ మానుకోవాలి. గండికోట సుధాకర్
రాయచోటి మండలం చెన్నముక్కపల్లి పంచాయతీలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో...
చీరాల మండలం కొత్తపాలెం గ్రామపంచాయతీ పరిధిలో ఆటో ఢీకొని 18 నెలల పాప మృతి
చీరాల: చీరాల మండలం కొత్తపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని దళిత నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది....
Dr. B. Gopi IAS: A Young Officer Driving Good Governance
A dedicated 2016-batch IAS officer whose people-centric administration and commitment to...
ఏపీలో ఓటర్ల జాబితా ప్రక్షాళన.. ఇంటింటి సర్వేకు రంగం సిద్ధం.
జూన్ 15 నుంచి ఇంటింటికీ వెళ్లి బీఎల్‌వోల సర్వే
నకిలీ, అనర్హుల ఓట్లు తొలగించి పారదర్శక...