రాష్ట్ర వేడుకగా వాసవి జయంతి, ప్రభుత్వానికి ఆర్యవైశ్యుల కృతజ్ఞతలు...

0
181

వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా నిర్వహించాలని నిర్ణయించడం పట్ల ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ఎర్ర శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.నేడు ఆదివారం కోదాడలోని కోదండ రామాలయ ప్రాంగణంలో ఉన్న వాసవి అమ్మవారి ఆలయంలో జయంతి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఐ వి ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శ్రీనివాసరావు, తెలంగాణ మలిదిశ ఉద్యమ నేత రాయపూడి వెంకటనారాయణలు శనివారం ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కుసుమ, ఆర్డీవో సూర్యనారాయణ, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమాదేవి లను కలిసి ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఉదయం 7 గంటల నుండి ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. పూజల అనంతరం నాగు బండి వీరయ్య, భద్రమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు.

Search
Categories
Read More
Telangana
ఊరు ఊర అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం
27-032026ఊరు ఊర అంగరంగవైభవంగా సీతారాముల కళ్యాణం మహోత్సవం తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ...
By MERIGE MALLESH 2026-03-27 11:19:09 0 347
Andhra Pradesh
వైఫల్యాలకు భయపడొద్దు.. కఠిన మార్గాన్నే ఎంచుకోండి: అమృత వర్సిటీ స్నాతకోత్సవంలో నారా లోకేశ్.
ప్రపంచం గతంలో ఎన్నడూ లేనంత వేగంగా మారుతోందని, కృత్రిమ మేధస్సు (ఏఐ), క్వాంటం ఇంజనీరింగ్ వంటి నూతన...
By Pagadala Venkateswar 2026-08-06 06:40:21 0 101
Telangana
వరంగల్ ప్రజలారా జాగ్రత్త.....!
భారత్ అవాజ్ న్యూస్: 5 జూలై రోజున వరంగల్ జిల్లా ఎంజీఎం దవాఖానలో  వర్షాకాలంప్రారంభమైన తర్వాత...
By Gujile Ramu 2026-08-05 01:51:34 0 166
SURAKSHA
Smita Sabharwal, IAS: Champion of Good Governance
From Young UPSC Achiever to One of India's Most Influential Women Bureaucrats – The...
By Lokeshwari Panthadi 2026-07-09 05:41:31 0 164
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం:కేతనపల్లెలో మామిడి తోటలో చెలరేగిన మంటలు
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం కేతనపల్లె గ్రామ సమీపంలో మామిడి తోటలో ఆదివారం మధ్యాహ్నం...
By Kothuru Murali 2026-02-23 12:00:01 0 182
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com