స్లగ్: ఘనంగా భవిష్య ఇంగ్లీష్ క్యాంపస్ లో వార్షికోత్సవం...

0
279

స్థలం:చీరాల

చీరాల పట్టణంలోని భవిష్య ఇంగ్లీష్ క్యాంపస్ ఆదిత్య పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపల్ చుక్క గంగాధర్ ఆధ్వర్యంలో రెండవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు చూడముచ్చటగా నృత్యాలు ప్రదర్శించారు.ముఖ్య అతిథులుగా చీరాల ఎమ్మార్వో గోపికృష్ణ,చీరాల ట్రాఫిక్ ఎస్ఐ పవన్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మార్వో గోపికృష్ణ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులని చూడగానే చూడముచ్చటగా ఉన్నారని నేటి చిన్నపిల్లలే భవిష్యత్ తరానికి పౌరులని తల్లిదండ్రులు వారిని మంచి నడవడికల్లో నడిచేలా ప్రేరణ చేయాలని కోరారు. ప్రైమరీ పాఠశాల నుంచే తల్లిదండ్రులు పిల్లలతో ప్రేమగా మెలగాలని పిల్లలు ఆలోచనలు అడిగి తెలుసుకోవాలని వారు ఎలా నడుచుకుంటున్నారు అని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలని అన్నారు. పిల్లలు చదువులోనే కాకుండా ఏ రంగాన్ని అధిగమించాలనుకుంటున్నారో వారికి భరోసా కల్పించి, ఉన్నతమైన శిఖరాలకు ఎదిగేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఎంతగానో ఉంటుందని వారు వివరించారు.పిల్లలని వారి అనుకున్నది సాధించేవరకు అందరూ పిల్లలకు భరోసాగా ఉండి నిరుత్సాహం ప్రదర్శించకుండా వారికి ధైర్యం చెప్పి పిల్లలు ఏ ఇబ్బందికి గురికాకుండా చూడాలని కోరారు. తను ఆహ్వానించిన పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. తదుపరి ఎస్సై పవన్ కుమార్ మాట్లాడుతూ చిన్నపిల్లలు మొదటి నుంచి ఎక్కువకాలం ఉపాధ్యాయులతోనే గడుపుతారని విద్యార్థులు ఎలా మెలగాలో విషయాన్ని ఎలా రానించాలో ఉపాధ్యాయులు పై ఎంతగానో ఉందని, ఉపాధ్యాయులు చదువులో వెనకబడిన విద్యార్థులను ప్రోత్సహించి వారు చదువులో గొప్ప స్థాయి చేరుకునేలా చదువు నేర్పించాలని వివరించారు. మైనర్ డ్రైవింగ్ పై తల్లిదండ్రులకు అవగాహన కలిగించి జరుగుతున్న ప్రమాదాలు గురించి వివరించారు. అనంతరం విద్యార్థులతో నృత్యాలు,డాన్స్ కార్యక్రమాలు నిర్వహించి,పాఠశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు గిఫ్ట్స్ బహుకరణ చేసి, ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు.

Search
Categories
Read More
Telangana
తెలంగాణ గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా
తెలంగాణ గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా తెలంగాణ రాష్ట్రానికి నూతన గవర్నర్‌గా...
By Pinnehasan Odela 2026-03-06 06:50:25 0 243
Andhra Pradesh
ప్రపంచంలో ఎక్కడ జరగని ఊహించని పోలీసులు ఇలా చేస్తారని కూడా కలలో కూడా ఊహించలేరు నీచులైన పోలీసులు ఉన్న ఎలాంటి శ్రేష్టాలు చేస్తారని భావించలేం
🚨 ప్రపంచంలో ఎక్కడా జరగని ఊహించని అత్యంత నీచమైన ఘోరమిది. నేరమిది. పోలీసులు ఇలా చేస్తారని కూడా కలలో...
By Chennaiah Kati 2026-06-22 05:59:42 0 136
Andhra Pradesh
Pawan Kalyan: మోదీ, అశ్విని వైష్ణవ్, చంద్రబాబులకు కృతజ్ఞతలు తెలిపిన పవన్ కల్యాణ్.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ చేసిన కృషి ఫలించింది. చారిత్రక,...
By Pagadala Venkateswar 2026-04-07 04:18:40 0 183
Andhra Pradesh
రైతన్న సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం - ఎమ్మెల్యే నరేంద్ర వర్మ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రైతన్నా మీకోసం వారోత్సవాలు’ కార్యక్రమంలో...
By Vadlamudi NagaVenkat 2026-03-17 18:05:33 0 933
Telangana
శ్రీ గురునానక్ దేవ్ జీ 556 వ జయంతి : పాల్గొన్న ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ డివిజన్ పరిధిలోని గురుద్వార సంగత్ సాహిబ్ సభ, గురు నానక్...
By Sidhu Maroju 2025-11-02 16:43:41 0 301
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com