ఆర్టీసీపై కాంగ్రెస్ కుట్రలు.. ఎవడబ్బ జాగీరు అని డిపోలను ధారాదత్తం చేస్తారు?: తలసాని నిప్పులు.|

0
456

సికింద్రాబాద్ : తొంభై ఏళ్లకు పైగా ఘన చరిత్ర కలిగిన ఆర్టీసీ మనుగడకు కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పు తలపెడుతోందని బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాణిగంజ్ డిపో వద్ద ఆందోళన చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల ధర్నాలో పాల్గొని ఆయన తన పూర్తి మద్దతు ప్రకటించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, ఎవడబ్బ జాగీరు అని డిపోలను ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తారని నిలదీశారు.

ఎలక్ట్రిక్ బస్సులను తీసుకువచ్చి ఆర్టీసీ ఉద్యోగులను రోడ్డున పడేయాలని ప్రభుత్వం చూస్తోందని, ఆ బస్సులను కూడా సంస్థ డ్రైవర్లు, కండక్టర్లతోనే నడిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలనే అమలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారని, దీన్ని బిఆర్ఎస్ ప్రోద్బలంగా చిత్రీకరించడం మంత్రుల అవివేకమని తలసాని విమర్శించారు.

సురక్షిత ప్రయాణానికి మారుపేరుగా నిలిచిన ఆర్టీసీ అభివృద్ధిలో కార్మికుల శ్రమ వెలకట్టలేనిదని, ముఖ్యంగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో వారి పాత్ర ఎంతో గొప్పదని గుర్తు చేశారు.

ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో వారికి అండగా ఉండి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

#sidhumaroju

Search
Categories
Read More
Telangana
NTR Statue at Ameerpet
NTR Statue had been inaugurated by our Chief minister Mr Yanamula Revanth Reddy Garu yesterday at...
By Terli Ashok 2026-05-29 04:22:06 0 295
Andhra Pradesh
Satya Kumar Yadav: 18 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏఐ.
Satya Kumar Yadav: 18 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏఐ ఆధారిత ప్రాజెక్టు ప్రారంభం: సత్యకుమార్ యాదవ్...
By Pagadala Venkateswar 2026-03-09 06:06:41 0 170
Andhra Pradesh
పేద విద్యార్థులకు అండగా ‘తులసి ఎడ్యుకేషనల్ గైడెన్స్ ట్రస్ట్ - డాక్టర్ కర్పూరపు మురళీకృష్ణ
పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి తులసి ఎడ్యుకేషనల్ గైడెన్స్ ట్రస్ట్ నిరంతరం కృషి చేస్తోందని ఆ...
By Vadlamudi NagaVenkat 2026-03-29 09:38:00 0 472
Ladakh
Digital Health Cards Rolled Out for Changpa Nomads in Ladakh
The Ladakh Health Department has launched a Digital Health Card scheme exclusively for the...
By Bharat Aawaz 2025-07-17 06:34:24 0 999
Telangana
నిజామాబాద్
ఎద్దు ఏడ్చిన ఎవుసం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు – మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల  ...
By Sadaq Sadaq 2026-06-20 11:40:57 0 204
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com