పేద విద్యార్థులకు అండగా ‘తులసి ఎడ్యుకేషనల్ గైడెన్స్ ట్రస్ట్ - డాక్టర్ కర్పూరపు మురళీకృష్ణ

0
470

పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి తులసి ఎడ్యుకేషనల్ గైడెన్స్ ట్రస్ట్ నిరంతరం కృషి చేస్తోందని ఆ సంస్థ అధినేత డాక్టర్ కర్పూరపు మురళీకృష్ణ పేర్కొన్నారు. చీరాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ట్రస్ట్ ద్వారా చేపట్టబోయే సేవా కార్యక్రమాలను వివరించారు. 2012లో ప్రారంభమైన ఈ ట్రస్ట్ ద్వారా ఇప్పటివరకు ఎంతోమంది విద్యార్థులకు వారి ఆర్థిక స్థితిగతులను బట్టి ఉచిత పాలిసెట్,ఎంసెట్ శిక్షణ అందించినట్లు ఆయన తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభమైన ఈ సేవలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని వివరించారు. పూర్తి స్థాయి శిక్షణ,ఉచిత భోజనం ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పూర్తి సమయం శిక్షణ ఇవ్వడంతో పాటు, శిక్షణా కాలంలో విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించబోతున్నట్లు ప్రకటించారు.

 ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన వారికి ప్రవేశ పరీక్షల్లో 10,000 లోపు ర్యాంకు సాధించిన విద్యార్థులకు ట్రస్ట్ తరపున నగదు ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు.అనాథ పిల్లలకు ప్రత్యేక సదుపాయాలు తల్లిదండ్రులు లేని పిల్లలకు, తండ్రి లేని విద్యార్థులకు ప్రాధాన్యతనిస్తూ మరిన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నట్లు డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు.

అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాల కోసం 7993085749 నంబరులో సంప్రదించాలని ఆయన సూచించారు.

Search
Categories
Read More
Telangana
పేద కుటుంబానికి అండగా నిలిచిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల నియోజకవర్గం : లక్షెట్టీపేట్ మండల హన్మంతుపల్లి గ్రామానికి చెందిన D. లావణ్య ఆరోగ్య ఖర్చుల...
By Avunoori Mahesh 2026-04-13 14:54:14 0 222
Telangana
"అలై బలైతో హృదయాలను కలిపిన దత్తన్న". జన్మదిన శుభాకాంక్షలు.|
హైదరాబాద్ : రాజకీయాల్లో పదవులు సంపాదించడం కంటే ప్రజల మనసులు గెలుచుకోవడం గొప్ప విషయం. అలాంటి...
By Sidhu Maroju 2026-06-12 06:33:16 0 281
Andhra Pradesh
జిల్లా ఆదాయం పెంపే లక్ష్యం.. జీఎస్టీ వసూళ్లపై ప్రత్యేక దృష్టి.
మదనపల్లి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా...
By Pagadala Venkateswar 2026-03-27 04:16:37 0 216
Andhra Pradesh
సీతానగరంలో యాక్సిడెంట్.. వ్యక్తి స్పాటెడ్
సీతానగరంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సీతానగరం బ్రిడ్జి...
By Boiena Rajesh 2026-09-04 05:30:49 0 79
Meghalaya
Meghalaya's Living Root Bridges Earn Wider Recognition
Meghalaya's iconic Living Root Bridges continue to receive national and international recognition...
By Fathima Safa 2026-07-01 10:51:57 0 83
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com