సీఎంపై పోస్టుల కేసు: వైసీపీ నేత పూడి శ్రీహరి అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు.

0
132

సీఎంపై సోషల్ మీడియా పోస్టుల కేసులో వైసీపీ నేత పూడి శ్రీహరికి ఎదురుదెబ్బ

అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పించాలన్న అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు

ప్రస్తుతానికి అరెస్టు చేస్తారనడానికి ఆధారాల్లేవని స్పష్టం చేసిన న్యాయస్థానం

కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 29వ తేదీకి వాయిదా

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారన్న కేసులో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణ కల్పించాలంటూ ఆయన తరఫున దాఖలైన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ప్రస్తుతం మిమ్మల్ని అరెస్టు చేస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు లేనందున, ఈ దశలో తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది.

 

ఈ కేసుకు సంబంధించి నిన్న జస్టిస్ యాదవల్లి లక్ష్మణరావు ముందు విచారణ జరిగింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. తమకు సమాచారం ఇవ్వకుండానే కింది కోర్టు ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఇచ్చిందని, అందువల్ల పోలీసులు తమ క్లయింట్లను అరెస్టు చేసే అవకాశం ఉందని, వారిని అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

 

దీనిపై స్పందించిన న్యాయమూర్తి, తమ ముందు ప్రస్తుతానికి అలాంటి సమాచారమేమీ లేదని పేర్కొన్నారు. కుప్పం కోర్టు ఇచ్చిన రిమాండ్ తిరస్కరణ ఉత్తర్వులను మాత్రమే సస్పెండ్ చేశామని, ఆ ఉత్తర్వులను కొట్టివేయలేదని స్పష్టం చేశారు. పోలీసుల తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 29వ తేదీకి వాయిదా వేసింది.

 

సీఎం చంద్రబాబుపై మార్ఫింగ్ ఫొటోలతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న ఆరోపణలతో పూడి శ్రీహరి, పార్టీ కార్యకర్త గిరీష్ కుమార్ రెడ్డిపై కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో వారిని రిమాండ్‌కు పంపాలన్న పోలీసుల అభ్యర్థనను కుప్పం కోర్టు తిరస్కరించగా, దాన్ని పోలీసులు హైకోర్టులో సవాలు చేసిన విషయం తెలిసిందే.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు
రాష్ట్ర యువజన క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డిని, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ చల్లా...
By Kothuru Murali 2026-03-22 06:35:50 0 210
Telangana
మంచిర్యాల్: అట్టహాసంగా జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు
మంచిర్యాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు అట్టహాసంగా...
By Bonagiri RaviShankar 2026-09-19 10:39:26 0 48
Andhra Pradesh
రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు..
రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు.. ఏపీ: కొత్త ఏడాదిలో రైతులకు పట్టాదారు పాస్పుస్తకాలు...
By Gadiyapudi Narendra 2025-12-28 16:36:26 0 303
Andhra Pradesh
పూనూరు నియోజకవర్గం :సదుం పోలీస్ స్టేషను ఆకస్మికంగా తనిఖీ చేసిన డిఎస్పి
పుంగనూరు నియోజకవర్గం, సదుం పోలీస్ స్టేషను డీఎస్పీ మహేంద్ర బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసి,...
By Kothuru Murali 2026-02-05 03:33:01 0 203
Andhra Pradesh
రాయచోటి నియోజకవర్గం లో డిజిటల్ మహానాడు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు గండికోట సుధాకర్
రాయచోటి నియోజకవర్గం లో డిజిటల్ విధానంలో జరిగిన మినీ మహానాడు విజయవంతం చేసిన ప్రతి టిడిపి నాయకులకు...
By Benguluri Madhubabu 2026-05-28 12:57:06 0 193
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com