విద్యా అనేది శక్తివంతమైన ఆయుధం: ఎంఎల్ఏ మిరియాల శిరీషదేవి

0
236

ఇంటర్మీడియట్, పదవ తరగతి CBSC ఫలితాల్లో రంపచోడవరం జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్ధులను సన్మానించి ఉన్నత చదువులకు తోడ్పాటు అందిస్తాను అని విద్యార్థులకు హామీ.రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ప్రపంచంలో అత్యంత విలువైనా ఆయుధం విద్యమాత్రమే అని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరిషాదేవి అన్నారు. రాజవొమ్మంగి మండలం వట్టిగెడ్డ ఆమె క్యాంపు కార్యాలయంలో సోమవారం ఇటీవల విడుదల అయిన ఇంటర్మీడియట్, CBSC పదవ తరగతి ఫలితాల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో రాణించిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె వై. రామవరం గురుకుల కళాశాలలో చదివి రాష్ట్ర గురుకుల కళాశాలల్లోనే మొదటి స్థానం సాధించిన దూరిపల్లి శర్వాణి శ్రీ సునంద MPC గ్రూప్ లో 986/1000 సాధించారు, ఈమెకు రూ;15000/- లు నగదు అందజేశారు. అలాగే ఒకేషనల్ గ్రూప్ లో 985/1000 మార్కులు సాధించిన బి.వెంకట సాయి మంజులకు రూ;10,000/- లు నగదు అందజేశారు . బై పి సి గ్రూపు లో 976/1000 మార్కులు సాధించిన తామ వెంకటేష్ కు రూ;5000/- లు నగదు అందజేశారు. బై పి సి గ్రూపు లో 975/1000 మార్కులు సాధించిన ఎన్.అఖిల, MPC లో 971/1000 మార్కులు సాధించిన పల్లాల రవీంద్ర రెడ్డి, MPC లో 966/1000 మార్కులు సాధించిన బి. సత్యశ్రీ లను అభినందించారు. మరియు ఏకలవ్య పాఠశాలల్లో రాష్ట్రస్థాయిలో CBSC ఫలితాల్లో ఎమ్.జయ రామకృష్ణ 478/500 మార్కులు సాధించిన ఆయనకు రూ; 5000/- లు మరియు ద్వితీయ స్థానంలో నిలిచిన బి.నవతేజ మరియు తృతీయ స్థానంలో నిలిచిన వెంకట లక్ష్మి లకు రూ;5000/- లు చొప్పున ప్రోత్సాహం నగదుగా అందజేశారు. అనంతరం విద్యార్థులకు ఆమె స్వయంగా వండిన ఆహార పదార్థాలను వడ్డించి స్వీట్ ప్యాక్ లను అందించి ఘనంగా సన్మానించారు* వీరు ప్రభుత్వ కళాశాల, పాఠశాలలో చదివి ఇలాంటి మార్కులు సాధించినందుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. వారి తల్లిదండ్రులకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. వారికి ఇంతటి మంచి తర్ఫీదు ఇచ్చి విద్యాబోధన చేసిన అధ్యాపక బృందానికి అభినందనలు తెలిపారు. వారికి ఆమె బోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళతో కలిసి బోజనాలు చేశారు. ఈ సందర్భంగా మట్టిలో మాణిక్యాలైన వారికి ఉన్నత చదువులకు తన వంతుగా ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఎలాంటి ఇబ్బంది ఉన్నా తనతో చెప్పాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్ధుల తల్లిదండ్రులు రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్‌ పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి, తెలుగు యువత అధ్యక్షులు మఠం విజయ్ భాస్కర్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మీలాంటి వారి సహాయ సహకారాలు అవసరం అని ఇలా మమ్మల్ని ఇంటికి పిలిచి మీతో పాటు భోజనాలు చేయటం మర్చిపోలేమని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో APIIC డైరెక్టర్ గొల్లపూడి పెద్దిరాజు, తెదేపా సీనియర్ నాయకులు గణజాల తాతారావ్ తదితరులు పాల్గొన్నారు.

 

# Yadagiri 

Search
Categories
Read More
Madhya Pradesh
Madhya Pradesh Advances Urban Development and Smart Cities
Madhya Pradesh is continuing to modernize its urban infrastructure through Smart City initiatives...
By Fathima Safa 2026-06-30 07:59:28 0 98
Andhra Pradesh
పుంగనూరు: సబ్ రిజిస్టార్ పై రూ. 70 వేల ముడుపులు ఆరోపణలు..
పుంగనూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇటీవల జరిగిన ఒక నివాస గృహ రిజిస్ట్రేషన్ సమయంలో సబ్...
By Kothuru Murali 2026-06-30 16:32:08 0 174
Gujarat
IIT Gandhinagar & C-DOT: A Powerful Tech Collaboration
This strategic partnership solidifies IIT Gandhinagar as a vital national hub for technological...
By Lokeshwari Panthadi 2026-06-27 08:56:35 0 159
Telangana
పెద్దపల్లిలో ఈనెల 19న జాబ్ మేళా....!
పెద్దపెల్లి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఫైనాన్స్ కంపెనీలో ఉపాధి కల్పించుటకు ఈనెల 19న పెద్దపల్లిలో...
By Sunka Santhosh 2026-06-16 19:27:35 0 120
Andhra Pradesh
బసినికొండలో అగ్ని ప్రమాదం – ఆకాశాన్ని తాకుతున్న మంటలు.
అన్నమయ్య జిల్లా కేంద్రంలోని మదనపల్లి బసినికొండలో బుధవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు...
By Pagadala Venkateswar 2026-04-09 04:31:45 0 185
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com