"ఎమ్మెల్యే చేతుల మీదుగా 'వారాహి టీ ప్యాలెస్' ప్రారంభోత్సవం.|

0
195

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ పరిధిలోని జొన్నబండలో 'శ్రీ వారాహి టీ ప్యాలెస్' ఘనంగా ప్రారంభమైంది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి, రిబ్బన్ కట్ చేసి ఈ నూతన టీ షాపును ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇలాంటి టీ రుచులు అరుదుగా లభిస్తాయని టీ చాలా రుచికరంగా ఉందని కితాబు ఇచ్చారు. నాణ్యమైన సేవలు అందించే ఇలాంటి వ్యాపారాలు మరిన్ని రావాలని, యువత స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలని ఆయన ఆకాంక్షించారు. షాపు యజమాని రాచకొండ వెంకటేష్‌ను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

యజమాని వెంకటేష్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే చేతుల మీదుగా తమ టీ ప్యాలెస్ ప్రారంభం కావడం సంతోషంగా ఉందని, కస్టమర్లకు నాణ్యమైన రుచిని అందిస్తూ వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో డోలి రమేష్, చెలిమెల మహేష్, నార్ల సురేష్‌తో పాటు స్థానిక నాయకులు, వ్యాపారవేత్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Kerala
Kerala Strengthens Environmental Conservation Measures
Kerala is actively advancing environmental conservation initiatives to protect its rich...
By Fathima Safa 2026-06-27 13:15:36 0 99
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు మండల పరిధిలో లారీ బోల్తా.
ఆదివారం, అన్నమయ్య జిల్లాలోని మొలకల చెరువు నుంచి చెన్నైకు టమోటా లోడుతో వెళుతున్న లారీ పుంగనూరు...
By Kothuru Murali 2026-01-19 12:21:15 0 266
Andhra Pradesh
Ambati Rambabu: అరెస్ట్ చేసుకోండి... ఐ డోంట్ కేర్: అంబటి రాంబాబు.
Ambati Rambabu: అరెస్ట్ చేసుకోండి... ఐ డోంట్ కేర్: అంబటి రాంబాబు 31-01-2026 Sat 21:43 | Andhra...
By Pagadala Venkateswar 2026-02-01 08:48:17 0 206
Andhra Pradesh
కడిమెట్ల గ్రామంలో తాగునీటి కొరత
కడిమెట్ల గ్రామంలో ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి తాగునీటి సమస్యలలు    మా కాలనీలో ఉన్నటువంటి...
By Boya Dasthagiri 2026-03-23 12:57:25 0 309
Ladakh
Ladakh Unites: Mass Civil Shutdown Over Missing MHA Guarantees
A complete voluntary shutdown paralyzed Ladakh's Leh and Kargil districts on June 23–24 as...
By Lokeshwari Panthadi 2026-06-26 09:54:42 0 82
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com