"ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లమని సీన్.. స్వీట్ షాపులో వసూళ్లకు ప్లాన్.. అల్వాల్‌లో కిలాడీ లేడీల అరెస్ట్!"

0
300

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అధికారులమంటూ అవతారమెత్తారు.. అక్రమ వసూళ్లే లక్ష్యంగా దుకాణాలపై దాడులకు దిగారు.. కట్ చేస్తే, అసలు విషయం బయటపడి ఇప్పుడు పోలీసుల కటకటాలపాలయ్యారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లమని నమ్మిస్తూ వ్యాపారులను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఇద్దరు నకిలీ మహిళా అధికారులను మంగళవారం అల్వాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అసలేం జరిగిందంటే..

ఓల్డ్ అల్వాల్ ఐజీ ప్రాంతంలోని ఒక స్వీట్ షాపులోకి ప్రవేశించిన ఇద్దరు మహిళలు, తాము ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లమని పరిచయం చేసుకున్నారు. 

దుకాణంలో తనిఖీలు చేస్తున్నట్లు నటిస్తూ, యజమానిని బెదిరించి భారీగా డబ్బులు డిమాండ్ చేశారు. 

అయితే, వారి ప్రవర్తనపై అనుమానం వచ్చిన స్వీట్ హౌస్ యజమాని చాకచక్యంగా వ్యవహరించారు. వెంటనే స్థానిక అసలు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్‌కు సమాచారం అందించారు.

చేరుకున్న అసలైన అధికారి, ఆ మహిళలను నిలదీశారు. ఐడెంటిటీ కార్డులు చూపాలని కోరగా.. "మేము ప్రైవేట్ ఫుడ్ ఆఫీసర్లం, మాది ప్రైవేట్ సంస్థ" అంటూ పొంతన లేని సమాధానాలు చెబుతూ బుకాయించే ప్రయత్నం చేశారు.

దీంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, సంఘటనా స్థలానికి చేరుకున్న అల్వాల్ పోలీసులు ఆ ఇద్దరు కిలాడీ మహిళలను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

ఎవరైనా తనిఖీల పేరుతో వస్తే వారి ఐడెంటిటీ కార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని, అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచిస్తున్నారు. నకిలీ అధికారుల ఆటలు సాగనివ్వబోమని పోలీసులు స్పష్టం చేశారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
తల్లికి వందనం కోసం NPCI లింక్ చేయాలి
తల్లికి వందనం పథకం ప్రయోజనాల కోసం అర్హులైన ఎస్సీ ఇంటర్ విద్యార్థులు తమ బ్యాంకు/పోస్టల్ ఖాతాలను...
By Boiena Rajesh 2026-06-01 12:18:52 0 236
Andhra Pradesh
పోలవరం ప్రాజెక్టులోPPA బృందం పర్యటన
*పోలవరం ప్రాజెక్ట్ లో పీ పీ ఏ బృందం పర్యటన*    ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పరిశీలిస్తున్న...
By Rajini Kumari 2025-12-24 08:03:24 0 229
Uttar Pradesh
Mission "Deep Tech Capital": UP Accelerates Infrastructure & Innovation
Uttar Pradesh is rapidly transitioning into India's "Deep Tech Capital," as highlighted by recent...
By Dunna Jessicaruth 2026-05-14 08:54:14 0 135
Telangana
ఎన్నికలు పకడ్బందీగా ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పని చేయాలి
జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్,   మహబూబాబాద్ జిల్లా, డిసెంబర్ 13:...
By Bheeshman King 2025-12-13 12:49:19 0 410
Prop News
PROPIINN : Your Trusted Path Through Real Estate
PROPIINNYour Dream Our Vision Times New Roman Your Real Estate Companion with a Mission. In...
By Bharat Aawaz 2025-06-26 05:53:13 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com