మంచిర్యాల ఎంపీ కార్యాలయం లో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎంపీ గడ్డం వంశీ కృష్ణ

0
211

మంచిర్యాల : పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారు మంచిర్యాలలోని తన ఎంపీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, డీసీపీ మరియు జిల్లా ఉపాధి అధికారితో కలిసి ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా ప్రజలు హాజరై తమ సమస్యలను వినిపించారు.

సుమారు 200 మందికి పైగా ప్రజల నుంచి వచ్చిన వినతులను ఎంపీ గారు శ్రద్ధగా విని, వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కలెక్టర్‌తో చర్చించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో ఆలస్యం జరగకుండా అధికారులు వేగంగా స్పందించాలని ఆదేశించారు.

అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్‌కు సంబంధించిన అంశాలపై కూడా ఎంపీ గారు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీతో నేరుగా మాట్లాడి పెండింగ్ దరఖాస్తుల వివరాలు తెలుసుకున్నారు. నిజమైన అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే లోన్లు మంజూరు చేయాలని స్పష్టం చేశారు.

జిల్లా ఉపాధి అధికారికి యువతకు ఉపాధి అవకాశాలపై ప్రత్యేక శిబిరాలు నిర్వహించి, నమోదు చేసిన అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రజలకు న్యాయం చేయడం, సంక్షేమ పథకాలు సరైన వారికి చేరేలా చూడడం తన ముఖ్య లక్ష్యమని ఎంపీ గారు పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

ఈ ప్రజాదర్బార్ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షుడు తదితరులు హాజరయ్యారు.

Search
Categories
Read More
Telangana
​భద్రాచలం బస్టాండ్‌లో మొబైల్ దొంగకు దేహశుద్ధి: పోలీసులకు అప్పగింత
భద్రాచలం:భద్రాచలం పట్టణంలోని ప్రధాన బస్టాండ్ ఆవరణలో ఆదివారం రాత్రి  ఒక మొబైల్ దొంగతనం కలకలం...
By Lakavath Kiran 2026-03-16 03:04:17 0 601
Tamilnadu
Tamil Nadu Advances Police Modernization and Cyber Security
Tamil Nadu is strengthening police modernization and cyber security through advanced technology,...
By Fathima Safa 2026-06-29 11:09:36 0 191
Telangana
మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు కు టీపీసీసీ కార్యదర్శి, న్యాయవాది పెద్దెల్లి ప్రకాష్ ఖబర్దార్ అంటూ వార్నింగ్?
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రముఖ న్యాయవాది టిపిసిసి కార్యదర్శి పెద్దెల్లి ప్రకాష్ మంథనిమాజీ...
By Thalakokkula Sadanandam 2026-06-10 08:33:33 0 344
Telangana
Accused Out on Bail in POCSO Case Murders Six People
బ్రేకింగ్ న్యూస్    పోక్సో కేసులో బెయిల్ మీద వచ్చి ఆరుగురిని హత్య చేసిన నిందితుడు...
By G k Nookala 2026-07-11 03:48:39 0 182
Telangana
దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  కంటోన్మెంట్ నియోజకవర్గం న్యూ బోయిన్పల్లి లో టింకు గౌడ్ యువసేన...
By Sidhu Maroju 2025-09-26 18:04:24 0 380
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com