మంచిర్యాల ఎంపీ కార్యాలయం లో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎంపీ గడ్డం వంశీ కృష్ణ

0
210

మంచిర్యాల : పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారు మంచిర్యాలలోని తన ఎంపీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, డీసీపీ మరియు జిల్లా ఉపాధి అధికారితో కలిసి ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా ప్రజలు హాజరై తమ సమస్యలను వినిపించారు.

సుమారు 200 మందికి పైగా ప్రజల నుంచి వచ్చిన వినతులను ఎంపీ గారు శ్రద్ధగా విని, వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కలెక్టర్‌తో చర్చించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో ఆలస్యం జరగకుండా అధికారులు వేగంగా స్పందించాలని ఆదేశించారు.

అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్‌కు సంబంధించిన అంశాలపై కూడా ఎంపీ గారు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీతో నేరుగా మాట్లాడి పెండింగ్ దరఖాస్తుల వివరాలు తెలుసుకున్నారు. నిజమైన అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే లోన్లు మంజూరు చేయాలని స్పష్టం చేశారు.

జిల్లా ఉపాధి అధికారికి యువతకు ఉపాధి అవకాశాలపై ప్రత్యేక శిబిరాలు నిర్వహించి, నమోదు చేసిన అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రజలకు న్యాయం చేయడం, సంక్షేమ పథకాలు సరైన వారికి చేరేలా చూడడం తన ముఖ్య లక్ష్యమని ఎంపీ గారు పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

ఈ ప్రజాదర్బార్ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షుడు తదితరులు హాజరయ్యారు.

Search
Categories
Read More
SURAKSHA
లు సంస్కరణలు - పునరావాసం
నేరస్థులలో మార్పు తీసుకురావడానికి జైళ్లలో వారికి వివిధ వృత్తి విద్యలలో శిక్షణ ఇస్తున్నారు. వారు...
By Kalaga Sailaja 2026-06-29 08:35:26 0 100
Andhra Pradesh
మైనారిటీ నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన_తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ శ్రీమతి షేక్ నూరి ఫాతిమా.
ఈరోజు గుంటూరు నగర మరియు తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యాలయంలో మైనారిటీ నాయకులతో విస్తృత...
By John Baji 2026-01-21 10:58:11 0 263
Telangana
క్యాతన్ పల్లి మున్సిపల్ లో గెలిచిన కౌన్సిలర్స్ ని సన్మానించిన ktr
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో క్యాతనపల్లి మున్సిపాలిటీలో గెలిచిన...
By Avunoori Mahesh 2026-04-12 12:51:46 0 182
Andhra Pradesh
మదనపల్లి: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు సర్వం సిద్ధం.
అన్నమయ్య జిల్లాలో ఈ నెల 21 నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు...
By Pagadala Venkateswar 2026-05-14 14:35:42 0 127
Andhra Pradesh
కమ్మవారి పాలెం గ్రామంలో ప్రజల త్రాగునీటి కష్టాలు
నందిగామ మండలం కమ్మవారిపాలెం గ్రామంలో మంచినీటి సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాలు ఆద్వర్యంలో...
By Patan Khuddus 2026-05-07 02:22:46 0 284
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com