జగిత్యాలలో కేసీఆర్ సభ ఉంది అంటే.. రెండో విడత రైతుబంధు ఇస్తున్నారు. ‎మూడవ విడత ఇవ్వాలంటే కేసీఆర్ ఇంకో సభ పెట్టాల్నా?

0
175

కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ అధినేత విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటి కూడా లేకపోగా.. కూల్చివేతలు, కాల్చివేతలు, పోలీసుల దాడులు, ఎదురు మాట్లాడితే వారిని పట్టుకుపోవడమే ఉందని విమర్శించారు.

‎ఇది అసలు రాజకీయమా అని ప్రశ్నించారు. జగిత్యాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందని ప్రశ్నించారు. ఈ సందర్భంలో ప్రజల మంచిని కోరే ప్రతి ఒక్కరూ ఒక్కటి కావాల్సిందేనని పిలుపునిచ్చారు. తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మళ్లీ చేయాల్సిందేనని స్పష్టం చేశారు.

‎వ్యవసాయం మంచిగుండాలి.. పల్లెలు బాగుండాలి.. వృత్తి పనులు బాగుండాలనే కదా మనం అంటున్నామని కేసీఆర్ తెలిపారు. తమ ప్రభుత్వంలో యాదవులకు గొర్రెలు ఇప్పించామని.. ఇప్పుడొస్తున్నాయా అని ప్రశ్నించారు. మత్స్యకారుల కోసం చేప పిల్లలు పంపిణీ చేశామని.. ఇప్పుడు ఇస్తున్నారా అని అడిగారు. బీడీ కార్మికులు ఎవరూ అడగకుండానే.. పెన్షన్లు ఇచ్చామని గుర్తుచేశారు. భారతదేశంలో ఎవరైనా అలా ఇస్తారా అని ప్రశ్నించారు. కానీ కాంగ్రెసోళ్లు పెన్షన్లు పెంచుతామని ఎగ్గొట్టారని అన్నారు. అదొక్కటే కాదని.. ఇంట్లో ఉన్న ఆడబిడ్డకు మహాలక్ష్మీ అని రూ.2500 ఇస్తామని చెప్పారని.. ఇచ్చారా అని ప్రశ్నించారు. స్కూటీలు ఇచ్చారా అని అడిగారు. అలా ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఏ ఒక్కటి ఇవ్వలేదని చెప్పారు.

‎అసలు తెలంగాణలో ఏం జరుగుతుందని కేసీఆర్ ప్రశ్నించారు. ఈ సందర్భంలో ప్రజల మంచిని కోరే ప్రతి ఒక్కరూ ఒక్కటి కావాల్సిందేనని పిలుపునిచ్చారు. మళ్లీ తెలంగాణ పునర్నిర్మాణ యజ్నం ప్రారంభం కావాల్సిందేనని స్పష్టం చేశారు. దాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. పోరాటం చేయాల్సిందేనని.. వాళ్లను నిలదీయాల్సిందేనని అన్నారు. తెలంగాణ ప్రజలు గెలిచి నిలవాల్సిందేనని స్పష్టం చేశారు.తెలంగాణ సమాచారం

Search
Categories
Read More
SURAKSHA
Shri Ravindra Telang, IAS: Engineering Vision Driving Sikkim’s Governance
From a mechanical engineering background to leading the administration of Sikkim, Shri Ravindra...
By Kalaga Sailaja 2026-07-31 09:19:09 0 87
Telangana
CM రేవంత్ రెడ్డికి షాక్‌ ఇచ్చిన తెలంగాణ విశ్రాంత ఇంజనీర్లు
కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయవచ్చని ప్రకటించిన తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం ‎రేవంత్...
By Ponnala Srinivasrao 2026-07-10 01:38:52 0 204
Telangana
నిజామాబాద్
సమస్య చిన్నదైనా, పెద్దదైనా... స్పందించే మనసే నాయకత్వం! నిన్నటి వర్షానికి కలవరపడ్డ ఐదో డివిజన్...
By Sadaq Sadaq 2026-07-29 09:18:31 0 155
Andhra Pradesh
చింతూరు: మన డబ్బులు - మన లెక్కలు యాప్ అవగాహన ర్యాలీ.
చింతూరు మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో "మన డబ్బులు - మన లెక్కలు" అనే సరికొత్త మొబైల్...
By Shyamala Yadagiri 2026-06-05 17:20:02 0 259
SURAKSHA
Karnataka Police: Blood Donors Saving Lives Today
Today Karnataka police officers led “Raktha Dana Jeevana Dana” blood donation camps...
By Kalaga Sailaja 2026-07-04 06:29:46 0 154
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com