తమిళనాడులో కొనసాగుతున్న సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం

0
152

తమిళనాడు/కృష్ణగిరి/తళి

 

*తమిళనాడులో కొనసాగుతున్న ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం.*

 

*ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ అభ్యర్థులకు ఓట్లేయాలని కోరుతున్న ఏపీ ముఖ్యమంత్రి*

 

*కృష్ణగిరి జిల్లా తళి నియోజకవర్గంలో ఎన్డీఏ అభ్యర్థి నాగేష్ కుమార్ ను గెలిపించాలంటూ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు*

 

*తళి నుంచి తిరుపతికి బస్ వేయాలని కోరిన స్థానిక ఎన్డీఏ నేతలు... అంగీకరించిన సీఎం చంద్రబాబు*

 

*ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ...*

 

• ఆంధ్రప్రదేశ్ చూపిస్తున్న ఆదరణ, అభిమానం తమిళనాడులోనూ చూపిస్తున్నారు.

• తమిళనాడుకు వచ్చినా నాకు సొంత గడ్డపై ఉన్నట్టే ఉంది.

• తమిళ సంస్కృతిపై ఎన్నో దాడులు జరిగినా ప్రాచీన వారసత్వాన్ని కాపాడుకున్న ప్రాంతం ఇది.

• ఎంతో మంది ప్రముఖులు, ఆధ్యాత్మిక ప్రాంతాలు కలిగిన తమిళనాడు రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది.

• ఏపీలోని తిరుపతికి తమిళ భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. మన భాష ఏదైనా అంతా ద్రవిడులమే.

• ఎన్టీఆర్ సినీ జీవితం కూడా తమిళనాడు నుంచే ప్రారంభమైంది.

• తమిళనాడు- ఏపీ సరిహద్దుల్లో ఉన్న చిత్తూరు నుంచే నేను వచ్చాను.

• చెన్నైకి తెలుగు గంగ నీళ్లు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్ దే. 

• తమిళనాడు- ఏపీ అన్నదమ్ములుగా కలిసి అభివృద్ధి చెందుతున్నాం.

• ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి సమర్ధ నాయకత్వం ఇస్తున్నారు. 

• ప్రధాని మోదీ సంక్షేమం- అభివృద్ధి- సుపరిపాలనతో దేశ భవిష్యత్తును పరుగులు పెట్టిస్తున్నారు.

• భారత్ ను ప్రపంచ పటంలో గౌరవమైన స్థానంలో ఉంచిన వ్యక్తి ప్రధాని మోదీనే.

• తమిళుల ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు పట్టని పార్టీలు కొన్ని ఉన్నాయి.

• వికసిత్ భారత్ కోసం ప్రధాని విజన్ తయారు చేశారు.

• మహిళలకు రిజర్వేషన్ కల్పించేందుకు బిల్లు తెచ్చారు.

• సమాజంలో మహిళలకు సమాన గౌరవం ఇచ్చేందుకు ఈ బిల్లు తెస్తే కాంగ్రెస్, డీఎంకే పార్టీలు ఆ బిల్లును వ్యతిరేకించాయి.

• ఢిల్లీని ఓడించామని డీఎంకే విర్రవీగుతోంది... మహిళా బిల్లును అడ్డుకున్న డీఎంకే పార్టీ ఏ సాధించింది..?

• పెరిగిన సీట్లలో 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తే కాంగ్రెస్, డీఎంకేలకు వచ్చిన ఇబ్బందేమిటి..?

• గతంలోనూ కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లుకు సహకరించలేదు.

• క్రెడిట్ అవసరం లేదని... ప్రతిపక్షాలకే క్రెడిట్ ఇస్తున్నామని ప్రధాని నేరుగా చెప్పినా కాంగ్రెస్, డీఎంకేలు బిల్లును ఓడించాయి.

• నియోజకవర్గాలు 50 శాతం పెరుగుతాయని స్పష్టంగా పేర్కొన్నా ఎందుకు వ్యతిరేకించారో డీఎంకే సమాధానం చెప్పాలి.

• తమిళనాడుకు తిరిగి పూర్వ వైభవం రావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ గెలవాలి.

• ఏపీలో గత పాలకులు విధ్వంసం చేస్తే 22 నెలల్లో విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తున్నాం.

• గోదావరి నుంచి కావేరి వరకూ నీళ్లు తీసుకువెళ్లేలా నదులు అనుసంధానం చేస్తాం.

• ఇది జరగాలంటే కేంద్రంలో ప్రధాని మోదీ ఉండాలి. త్వరలో గంగా-కావేరీ కలవాలి.

• దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగదు. ఈ ప్రాంతానికి అన్యాయం జరగనివ్వను.

• తమిళనాడు అన్ని అంశాల్లోనూ వెనుకబడే ఉంది. దీనికి కారణం ఎవరో ప్రజలందరికీ తెలుసు.

• బసవ జయంతి లాంటి పవిత్రమైన రోజు ఈ ప్రాంతానికి రావటం నా అదృష్టం.

• తమిళనాడులో అప్పుల భారం పెరిగింది. శాంతిభద్రతలు పడిపోయాయి, డ్రగ్స్, మహిళలపై దాడులు, కస్టోడియల్ మరణాలు పెరిగాయి.

• మద్యంపై రేట్లు పెంచుకుని డీఎంకే ఆదాయం పెంచుకుంటోంది.

• అభివృద్ధి, ఉద్యోగాలు కావాలంటే కేంద్ర సహకారం అవసరం. జయలలిత స్పూర్తితో అభివృద్ధి జరగాలి.

• ఎన్డీఏకు వేసే ఓటుతో తమిళనాడు రాష్ట్రం గెలుస్తుంది. ప్రతీ ఇల్లూ, ప్రతీ వ్యక్తీ గెలుస్తారు.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్: పెదమతల్లి విగ్రహం ప్రతిష్ఠాపనలో పలుగొన్న మాజీ ఎమ్మెల్యే బిగలగణేష్ గుప్త
తేదీ:23.04.2026 నిజామాబాద్.ముదిరాజుల ఆరాధ్య దైవం శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్టాపనలో...
By Sadaq Sadaq 2026-04-23 07:37:36 0 170
Andhra Pradesh
పుంగనూరు: సిఆర్పిఎఫ్ జవాను మృతి పై వివరాలు తెలిపిన డి. ఎస్. పి.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ కు వై...
By Kothuru Murali 2026-01-23 13:01:57 0 224
Telangana
మల్లంపేట (దుండిగల్) లో రంజాన్ పండుగ ప్రత్యేక ప్రార్థనలు
మల్లంపేట (దుండిగల్) లో రంజాన్ పండుగ ప్రత్యేక ప్రార్థనలు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా జరుగుతాయి....
By Ponnala Srinivasrao 2026-03-21 07:55:03 0 268
Telangana
నిజామాబాద్: 27 వ డివిజాన్ లో చలివేంద్రం ప్రారంభం
నిజామాబాద్:ఈరోజు 27వ డివిజన్ వర్ని చౌరస్తాలో ఖిల్లా రామ్ మందిర్ ప్రధాన కార్యదర్శి కల్పే చిరంజీవి...
By Sadaq Sadaq 2026-04-19 12:04:32 0 158
Telangana
క్రికెట్ చూస్తుంటే.. ఈ యాడ్స్ అవసరమా?
"చిన్నారులు చూస్తున్న సమయంలో అడల్ట్ యాడ్స్‌పై ఎంపీ కీర్తి ఆజాద్ అభ్యంతరం" హైదరాబాద్, జూలై...
By Sidhu Maroju 2026-07-05 11:57:28 0 180
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com