ప్రభుత్వ పాఠశాలల్లో వేకెన్సీ బోర్డులు పెట్టాలి మంత్రి నారా లోకేష్ ఆకాంక్ష

0
114

ప్రభుత్వ పాఠశాలల్లో నో వేకెన్సీ బోర్డులు పెట్టాలి.

 

అదే మంత్రి నారా లోకేష్ గారి ఆకాంక్ష.

 

పేదల బిడ్డలు బాగా చదువుకోవాలి.

 

రూ.5కోట్లతో గురుకుల పాఠశాల పునఃనిర్మాణం.

 

-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.

 

ఇంటర్మీడియట్లో ప్రతిభ చూపిన 157 మందికి నగదు ప్రోత్సాహకాలు.

 

స్వచ్చందంగా అందజేసిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.

 

సతీసమేతంగా పాల్గొన్న ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు, జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి కమిషన్ ఛైర్ పర్సన్ తేజస్వి పొడపాటి గారు,

 

ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు, 20/04/2026.

 

ప్రభుత్వ పాఠశాలలో నో వేకెన్సీ బోర్డులు, నో సీట్స్ అనే బోర్డులు పెట్టాలన్నదే మంత్రి నారా లోకేష్ గారి ఆకాంక్ష అని ఆ దిశగా మైలవరం నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పేర్కొన్నారు.

 

జి.కొండూరు మండలం కుంటముక్కల గ్రామంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలలో సోమవారం ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు గారి జన్మదిన వేడుకల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఇటీవల ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా అత్యంత ప్రతిభ చూపిన 157 మందికి విద్యార్థినులకు రూ.8.20 లక్షల నగదు ప్రోత్సాహకాలు అందజేశారు.

 

ఈ కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారితో పాటు వారి సతీమణి శ్రీ మతి శిరీష గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి కమిషన్ ఛైర్ పర్సన్ తేజస్వి పొడపాటి గారు, జిల్లా కలెక్టరేట్ జి.లక్ష్మీశ గారు తదితరులు పాల్గొన్నారు.

ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. 

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ " ఇటీవల ఆకస్మిక పర్యటనకు విచ్చేసిన సందర్భంగా కుంటముక్కల గురుకుల పాఠశాలలో విద్యార్థినులు తరగతి గదుల్లోనే రాత్రుళ్లు నిద్రిస్తూ, మళ్ళీ అక్కడే విద్యాబోధన జరుగుతున్న విషయాన్ని స్వయంగా చూశానన్నారు.

 

అప్పట్లో మంత్రిగా ఉన్న సమయంలో తన తండ్రి గారు ఈ పాఠశాలను శంకుస్థాపన చేసి ప్రారంభించారని, కార్యక్రమంలో నాలుగు దశాబ్దాల పాటు ఎంతమంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఈ పాఠశాల శిథిలావస్థకు చేరిందన్నారు. మళ్లీ తిరిగి ఇప్పుడు పాఠశాల నిర్మాణానికి తను ప్రభుత్వానికి రూ.4కోట్ల ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. ఇందులో ఎంపీ నిధులు రూ.1.40 కోట్లు కాగా, డి.ఎం.ఎఫ్ నుంచి 2.60 కోట్లకు ప్రతిపాడ్స్8 పంపామన్నారు. మరో రూ.1కోటి సి.ఎస్.ఆర్ నిధులు తను వెచ్చించి రూ.5కోట్లతో పాఠశాల పునఃనిర్మాణం చేసున్నట్లు వెల్లడించారు.

 

బాలికల విద్యను ప్రోత్సహించడం కోసం అప్పట్లో 925 మార్కులు, అంతకు పైబడి సాధించిన వారందరికీ స్కాలర్ షిప్స్ ఇస్తామని ప్రకటించానన్నారు. ఈ విద్యాసంవత్సరంలో ఇంటర్మిడియట్ ఫలితాల్లో ఇక్కడి విద్యార్థినులు 255 మందికి 251 మంది పాస్ అయ్యి 98.8 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. గత ఏడాది 93 శాతం కంటే ఏడాది ఎక్కువ శాతం ప్రతిభ ప్రదర్శించారన్నారు. వచ్చే ఏడాది నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు.

 

 

పేదల బిడ్డలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు, సౌకర్యాలు ఉండాలనే ప్రధాన లక్ష్యంతో కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పాఠశాల తో పాటు కొండపల్లిలోని బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కూడా దత్తత తీసుకొని అభివృద్ధి పనులు శరవేగంగా చేపట్టినట్లు వెల్లడించారు. క్రీడా పరికరాల కోసం, ఇతర అవసరాలకు స్వచ్ఛందంగా సొమ్మును ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. టెన్త్ ఫలితాలు రాగానే ఆ విద్యార్థులతో కూడా ఇదే విధంగా మమేకమై ప్రోత్సాహక నగదు బహుమతులు అందజేస్తామన్నారు.

 

ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా మైలవరం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. విద్యార్థిని, విద్యార్థులు ఎంచుకున్న లక్ష్యాలను నెరవేర్చుకోవడం కోసం కష్టపడి చదువుకోవాలని పిలుపునిచ్చారు. చదువుకు పేదరికం అడ్డు కాకూడదన్నారు. విద్యతోనే సర్వతోముఖాభివృద్ధి సాధ్యమన్నారు. పిల్లలు బాగా చదువుకుని వారి తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చాలన్నారు. అంకితభావంతో విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు.

 

ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రతిభ చూపిన విద్యార్థినులను ఒక్కొక్కరిని ఆప్యాయంగా పలకరించి వారిని ఘనంగా సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ అక్కల రామ్మోహనరావు (గాంధీ) గారు, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
​'Pink Patrol' for Women's Safety
​Content: To ensure the security of women, the state has deployed 'Pink Patrol' teams. These...
By Kalaga Sailaja 2026-06-29 10:10:58 0 106
Telangana
తూంపల్లిలో గ్రామంలో ఎస్.ఐ.ఆర్ ఓటర్ల సర్వే ఫామ్స్ పంపిణీ
🎤భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ మండల పరిధిలోని...
By Chunarkar Jagadeesh 2026-06-29 10:09:43 0 175
Andhra Pradesh
సోలార్ పంపు సెట్లతో అధిక లాభాలు
సోలార్ పంపు సెట్లతో అధిక లాభాలు పొందవచ్చునని మండల వ్యవసాయ శాఖాధికారి మజ్జి శ్యామసుందర్ అన్నారు....
By Boiena Rajesh 2026-04-08 11:41:13 0 137
Andhra Pradesh
కార్యకుల సమ్మెతో పోర్టులో నిలిచిపోయిన కార్యకలాపాలు – చట్టాల మార్పుపై ఆమ్ ఆద్మీ పార్టీ నిరసన
కాకినాడ: నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం కేంద్ర కార్మిక సంఘాలు...
By Ratna Sekhar 2026-02-12 09:19:58 0 205
SURAKSHA
​'Drug-Free Karnataka' Initiative
The Karnataka Police have launched an intensive campaign to eradicate the drug menace across the...
By Kalaga Sailaja 2026-06-29 10:16:08 0 112
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com