గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు

0
299

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎమ్మిగనూరు పట్టణంలోని ఆర్ & బి గెస్ట్ హౌస్ ప్రాంగణంలో జరిగింది.వేడుకల్లో భాగంగా కేక్ కటింగ్, ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించడంతో పాటు అన్న క్యాంటీన్‌ను సందర్శించి, భోజనం వడ్డించి, ఈ సందర్భంగా శ్రీమతి నారా భువనేశ్వరి గారు చేసిన రూ 76 లక్షల విరాళం గురించి వివరించారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ చేసి, 8వ వార్డులో ఏర్పాటు చేసిన త్రాగునీటి చెలివేంద్రని ప్రారంభించారు.ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయనకు దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ గారు, రాష్ట్ర కుర్నీ కార్పొరేషన్ ఛైర్మన్, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్, ఏఎంసీ ఛైర్మన్, పీఏసీఎస్ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు, మండల మరియు పట్టణ కమిటీ సభ్యులు, క్లస్టర్, యూనిట్, బూత్ కన్వీనర్లు, తెలుగు మహిళలు మరియు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు పట్టణం లో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
గురువారం సాయంత్రం అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పుంగనూరులోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి...
By Kothuru Murali 2026-02-13 06:15:13 0 185
Andhra Pradesh
Madanapalle: మదనపల్లెలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ త్రివర్ణ రంగుల దుస్తులు, జాతీయ జెండాలతో సందడి చేసిన చిన్నారులు. ఆకట్టుకున్న దేశభక్తి వేషధారణ.
Madanapalle: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా చిన్నారులు వినూత్న రీతిలో దేశభక్తిని చాటారు....
By Pagadala Venkateswar 2026-08-15 05:18:01 0 70
BMA
Counter-Memes: The New Language of Civic Resistance
While political establishments use memes for propaganda, Indian youth are utilizing them for...
By JoinBMA 2026-08-21 18:41:04 0 317
Telangana
52 మంది మావోయిస్టులు లొంగుబాటు
52 మంది మావోయిస్టులు లొంగుబాటు ఛత్తీస్‌గఢ్‌లో 52 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట...
By Pinnehasan Odela 2026-01-15 14:16:22 0 266
Telangana
ఆబిడ్స్ ఇస్కాన్ ఆలయంలో జూన్ 27న శ్రీ జగన్నాథ రథయాత్ర
 అబిడ్స్‌ ఇస్కాన్‌ ఆలయ ఆధ్వర్యంలో జూన్ 27న శ్రీ జగన్నాథ రథయాత్రను ఘనంగా...
By Sidhu Maroju 2025-06-26 10:25:55 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com