ఏపీలో అమ్మను తలపిస్తున్న అన్న క్యాంటీన్ సేవలు

0
143

*Press Release*

 

*అమ్మను తలపిస్తోన్న అన్న క్యాంటీన్ల సేవలు*

 

*లక్షల మంది పేదల కడుపు నింపే మహోన్నత కార్యక్రమం*

 

*రూ.5 లకే పరిశుభ్ర వాతావరణంలో గౌరవంగా పేదలకు భోజనం: నారా భువనేశ్వరి*

 

*ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినం సందర్భంగా అన్న క్యాంటీన్ల కు రూ.76 లక్షల విరాళం ఇచ్చిన భువనేశ్వరి*

 

*భువనేశ్వరి ఇచ్చిన విరాళంతో రేపు రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్న క్యాంటీన్లలో ఉచితంగా భోజనం*

 

*అమరావతి, ఏప్రిల్ 19 :* రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు అన్నం పెట్టే అమ్మను తలపిస్తున్నాయని నారా భువనేశ్వరి అన్నారు. అన్న క్యాంటీన్ల సేవలు ఎంతో మన్నన పొందాయని...లక్షల మంది పేదల కడుపు నింపే మహోన్నత కార్యక్రమంగా కూటమి ప్రభుత్వం దీన్ని నిర్వహించడం గొప్ప విషయం అని భువనేశ్వరి అభిప్రాయ పడ్డారు. రూ.5లకే పరిశుభ్ర వాతావరణంలో ప్రభుత్వం గౌరవంగా పేదలకు భోజనం అందిస్తోందని అమె అన్నారు. ఏప్రిల్ 20వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా నారా భువనేశ్వరి రూ.76 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు సీఎం క్యాంప్ కార్యాలయంలో చెక్ ను అన్న క్యాంటీన్ సీఈవోకు అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినం అయిన ఏప్రిల్ 20న రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్న క్యాంటీన్లలో పూర్తి ఉచితంగా భోజనం అందించాలని భువనేశ్వరి కోరారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా పేదలకు కడపు నింపే అన్న క్యాంటీన్లకు విరాళం ఇవ్వడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని భువనేశ్వరి అన్నారు. అత్యంత పరిశుభ్రమైన వాతారణంలో అన్న క్యాంటీన్లలో పౌష్టికాహారం అందించడం గొప్ప విషయం అని ఆమె అభిప్రాయ పడ్డారు. రోజువారీ కూలీలు, పేదలు ఈ పథకం ద్వారా ఎంతో లబ్ది పొందుతున్నారని...ఇలాంటి కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కోరారు. ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని భువనేశ్వరి అన్నారు. అన్న క్యాంటీన్లకు ఆర్థికంగా చేయూతనిచ్చి స్ఫూర్తి నింపేందుకు అంతా ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం కంటే సంతృప్తి ఏముంటుదని వ్యాఖ్యానించిన భువనేశ్వరి....తాను పలు సందర్భాల్లో అన్న వితరణ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కలిగిన సంతృప్తిని, ప్రజల స్పందనను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. తమ మనవడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా 12 ఏళ్లుగా ప్రతీ ఏటా తిరుమలలో అన్న ప్రసాదానికి రూ.44 లక్షలు విరాళంగా ఇస్తున్న విషయాన్ని ఆమె ప్రస్థావించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నారా భువనేశ్వరి....అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళం ఈ ఏడాది మీ పుట్టిన రోజుకు మేమిచ్చే బహుమానం అంటూ వ్యాఖ్యానించారు. తన పేరు మీద అన్న క్యాంటీన్లకు ఒక రోజు అన్నదానానికి రూ.76 లక్షల విరాళం ఇచ్చిన తన సతీమణి భువనేశ్వరిని ముఖ్యమంత్రి అభినందించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ... “రాష్ట్రంలో అన్నదాన కార్యక్రమాన్ని ఒక గొప్ప కార్యక్రమంగా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. తిరుమలలో భక్తుల సహకారంతో 4 దశాబ్దాలుగా అన్నదానం జరుగుతోంది. అలాగే ప్రముఖ దేవాలయాల్లోనూ అన్నదానం నిర్వహిస్తున్నాం. పేదలకు రూ.5 లకే కడుపునింపే అన్న క్యాంటీన్ సేవలను మరింత విస్తరించాలి. నాణ్యతను పాటించడంతో పాటు..పవిత్రంగా, గౌరవంగా, పరిశుభ్రంగా ఆహారం అందించే ఈ కార్యక్రమానికి దాతలు ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వాలి. పుట్టిన రోజు, పెళ్లి రోజు సహా తమకు నచ్చిన రోజు భోజనాలకు అయ్యే ఖర్చును విరాళంగా ఇచ్చేందుకు ప్రజలు ముందుకు రావాలి. ఇదొక స్ఫూర్తి దాయకమైన కార్యక్రమంగా మారి బ్రాండ్ ను సృష్టించాలి' అని చంద్రబాబు అన్నారు.

Search
Categories
Read More
BMA
BMA
Your Voice. Your Network. Your Future.Bharat Media AssociationAnchor, News Reader, Reporter,...
By Bharat Aawaz 2025-06-05 07:57:51 0 2K
Andhra Pradesh
న్యా వెరా” మహిళల న్యాయ అవగాహనా సదస్సులో పాల్గొన్న డా. గొట్టిపాటి లక్ష్మీ
“న్యా వెరా” మహిళల న్యాయ అవగాహనా సదస్సులో పాల్గొన్న డా. గొట్టిపాటి లక్ష్మీ దర్శి...
By Chennaiah Kati 2026-07-11 13:28:39 0 99
Chandigarh
Special Revision of Electoral Rolls Commences Across Manipur
The Election Commission of India officially launched Phase III of the Special Intensive Revision...
By Dunna Jessicaruth 2026-05-20 09:38:51 0 267
Telangana
కేసీఆర్ గారే మరమనిషి అయితే ఇంకెవరు హృదయం ఉన్న మనుషులు?
ఈరోజు అధికారంలో ఉన్నది రేవంత్ రెడ్డి.. ఆయన పాలన బాగుందా తల్లి? తెలంగాణ ఉద్యమ నాయకుడిని పట్టుకొని...
By Ponnala Srinivasrao 2026-04-26 02:24:07 0 153
Andhra Pradesh
మదనపల్లె: కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్యాయత్నం
మదనపల్లె మండలం, మాలెపాడు దేవలంపల్లికి చెందిన గణప్రసాద్ (35) కుటుంబ కలహాల కారణంగా పురుగుమందు తాగి...
By Pagadala Venkateswar 2026-01-06 07:24:40 0 246
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com