"మహిళా బిల్లుపై రగిలిన ఆగ్రహం… రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నం అల్వాల్‌లో ఉద్రిక్తత”

0
377

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : శ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలతో అల్వాల్ ఐజి సర్కిల్ పరిధిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

మహిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ అవలంభించిన వ్యతిరేక విధానాన్ని ఖండిస్తూ, రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేసే ప్రయత్నం బీజేపీ నాయకులు చేశారు.

అల్వాల్ సర్కిల్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

మహిళల గౌరవం, హక్కులు మరియు రాజకీయాల్లో వారి భాగస్వామ్యాన్ని పెంపొందించే చారిత్రక నిర్ణయాన్ని అడ్డుకునే ప్రయత్నాలను తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, మహిళల సాధికారతను అణగదొక్కే రాజకీయాలకు ఇది గట్టి హెచ్చరిక అని స్పష్టం చేశారు. మహిళల అభివృద్ధి, గౌరవం కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమానికి అల్వాల్ సర్కిల్‌కు చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు విశేషంగా హాజరై మహిళా బిల్లుకు తమ మద్దతును ప్రకటించారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
SURAKSHA
Vinay Kumar Gadge, IPS: A Visionary Guardian of Justice
A dedicated IPS officer of the AGMUT Cadre, Vinay Kumar Gadge has earned recognition for his...
By Lokeshwari Panthadi 2026-07-22 07:20:26 0 235
Andhra Pradesh
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్‌లో నివసిస్తున్న ప్రజలకు అప్రమత్తత సూచన
హైదరాబాద్‌: బొల్లారం, సికింద్రాబాద్‌, కొంపల్లి, బోయిన్పల్లి, సుచిత్ర,...
By VALLERU SIMHADRI 2026-09-04 07:43:37 0 193
Telangana
రేషన్ బియ్యం విక్రయిస్తే కఠిన చర్యలు: తహసిల్దార్
రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు పంపిణీ చేసే ఉచిత రేషన్ బియ్యం ఎవరైనా దళారులకు అమ్మితే చట్ట ప్రకారం...
By Katiyala JeevanRaj 2026-03-31 05:02:35 0 478
Andhra Pradesh
విద్యార్థులకు ఉచిత నోట్ బుక్స్ పంపిణీ
  పాఠశాల చిన్నారులకు విద్యా ప్రోత్సాహం. దాతల సేవాభావానికి ప్రశంసలు ఆర్యవైశ్య సంఘం...
By Patan Khuddus 2026-07-06 16:57:20 0 272
Andhra Pradesh
హార్సిలీహీల్స్ ఘాట్ రోడ్డులో టాటా ఏస్ బోల్తా.. పలువురికి గాయాలు.
మదనపల్లె నుంచి ఆదివారం 10 మంది కుటుంబ సభ్యులతో హార్సిలీహీల్స్ సందర్శనకు వెళ్లిన టాటా ఏస్ వాహనం,...
By Pagadala Venkateswar 2026-03-23 05:52:03 0 206
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com