లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు చుక్కెదురు... విపక్షాల తీరుపై చంద్రబాబు ఫైర్.

0
147

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించని వైనం

అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు

మూడింట రెండొంతుల మెజారిటీ రాకపోవడంతో వీగిపోయిన బిల్లు

కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలే కారణమన్న సీఎం చంద్రబాబు

ఇది మహిళలకు చేసిన ద్రోహమని వ్యాఖ్య

చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే కీలక బిల్లును అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు చారిత్రక తప్పిదానికి పాల్పడ్డాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. ఇది కేవలం రాజకీయ దురుద్దేశం మాత్రమే కాదని, పార్లమెంటులో సమాన ప్రాతినిధ్యం ఆశిస్తున్న లక్షలాది మంది మహిళలకు చేసిన ద్రోహమని ఆయన అన్నారు. ఈ విషయాన్ని దేశం గుర్తుంచుకుంటుందని హెచ్చరించారు.

 

వివరాల్లోకి వెళితే, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన 131 రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. శుక్రవారం జరిగిన ఓటింగ్‌లో ఈ బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. అయితే, రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే మూడింట రెండొంతుల ప్రత్యేక మెజారిటీ అవసరం కాగా, ఆ మార్కును అందుకోకపోవడంతో బిల్లు వీగిపోయింది. 2029 ఎన్నికల నుంచే ఈ రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

 

ఈ పరిణామంపై ఏపీ సీఎం చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ట్వీట్‌ను రీపోస్ట్ చేస్తూ, మహిళా సాధికారతకు అడ్డుపడిన ప్రతిపక్షాల వైఖరిని ఆయన తప్పుబట్టారు. వారి చర్యల వల్ల దేశం ఒక చారిత్రక అవకాశాన్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
విజయవాడ ఇంద్రకీలాద్రి తిరుపతి తరహా ప్రసాదాలు తయారీ
పత్రికా ప్రకటన   ఇంద్రకీలాద్రి,28 జనవరి 2026   తిరుమల తరహాలో 'దుర్గమ్మ' ప్రసాదాల...
By Rajini Kumari 2026-01-28 13:09:57 0 241
BMA
Disaster Defense: Press as the Frontline Emergency Relay
During natural disasters like cyclones, earthquakes, and urban floods, the press serves as an...
By JoinBMA 2026-08-21 10:35:54 0 142
Andhra Pradesh
మంగళగిరి నియోజకవర్గంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్
*మంగళగిరి నియోజకవర్గం రేవేంద్రపాడులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేష్*  ...
By Rajini Kumari 2026-03-09 17:23:45 0 223
SURAKSHA
UP Cops Today: Cyber Awareness Warriors For Citizens
On Wednesday, UP police officers conducted cyber crime awareness campaigns across districts. In...
By Kalaga Sailaja 2026-07-04 09:48:26 0 109
Andhra Pradesh
మదనపల్లిలో మెగా ఉచిత పశువైద్య శిబిరం
మదనపల్లి మండలం వేంపల్లె పంచాయతీలో బీటీ కళాశాల పూర్వ విద్యార్థుల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం మెగా...
By Pagadala Venkateswar 2026-02-02 04:42:57 0 196
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com