"అల్వాల్‌, బొల్లారం లో ఆగని దొంగల 'షికారు': రెండ్రోజుల్లో రెండు బైకులు మాయం!

0
422

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : నగర శివార్లలోని అల్వాల్.. బొల్లారం పరిసర ప్రాంతాల్లో వాహన దొంగలు హల్చల్ చేస్తున్నారు. వరుస చోరీలతో స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నారు. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే రెండు వేర్వేరు చోట్ల బైకులు అపహరణకు గురయ్యాయి.

అల్వాల్ ఎస్ఐ తరుణ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..

ఓల్డ్ అల్వాల్‌లోని మంగాపురం కాలనీ ఫేజ్-3లో నివసించే కొల పోచయ్య, తన ఇంటి ముందు పార్క్ చేసిన హోండా సిబి యూనికార్న్ (TS10EK 7536) బైక్ దొంగతనానికి గురైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

మరో ఘటనలో.. బొల్లారం రైల్వే స్టేషన్ సమీపంలోని బర్టన్ గూడ వద్ద షాకింగ్ చోరీ జరిగింది. రోడ్డా శ్రీకాంత్ అనే వ్యక్తి తన యాక్టివా (TS 09 EB 2085) వాహనాన్ని బాలాజీ స్వీట్ హౌస్ ముందు నిలిపారు. అయితే పొరపాటున బండికి తాళం వేయడం మర్చిపోయి లోపలికి వెళ్లారు. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే గుర్తుతెలియని వ్యక్తులు ఆ బండిని ఎత్తుకెళ్లారు.

ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసుకుని ఆల్వాల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వాహనదారులు తమ వాహనాలకు విధిగా లాక్ వేసుకోవాలని, సీసీ కెమెరాలు ఉన్న ప్రాంతాల్లోనే పార్క్ చేస్తూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానికి చిరుకానుక పంపిన నారా లోకేష్ బాబు
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాలివీడు ఐటిడీపీ అధ్యక్షుడు లక్కిm శ్రీహరి నాయుడు...
By Benguluri Madhubabu 2026-03-30 08:55:37 0 270
Andhra Pradesh
రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & విద్యాశాఖ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనాయకులు యువగళం సారథి శ్రీ నారా లోకేష్ గారి జన్మదినము సందర్భంగా
రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & విద్యాశాఖ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన...
By Chennaiah Kati 2026-01-24 06:09:36 0 392
SURAKSHA
V. Rashmi, IAS: A Visionary Leader Transforming Governance
A distinguished 1996-batch Karnataka cadre IAS officer, V. Rashmi has earned nationwide respect...
By Lokeshwari Panthadi 2026-07-18 11:04:04 0 129
Andhra Pradesh
ఇంద్రకీలాద్రిపై వైభవంగా వసంత నవరాత్రులు
ప్రకటన ఇంద్రకీలాద్రిపై వైభవంగా వసంత నవరాత్రులు: కనకాంబరాలు, గులాబీలతో జగన్మాతకు ప్రత్యేక...
By Rajini Kumari 2026-03-20 16:19:51 0 243
Puducherry
Puducherry Strengthens Waste Management and Clean Cities
Puducherry continues to enhance waste management and clean city initiatives in 2026 by improving...
By Fathima Safa 2026-07-04 13:28:08 0 164
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com