చీరాలలో ఘనంగా జర్నలిస్టు ఆధ్వర్యంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.. ఏరియా ఆసుపత్రిలో సేవా కార్యక్రమాలు – పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసిన చీరాల జర్నలిస్టులు

0
204

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా చీరాలలోని ముక్కోణపు పార్క్ వద్ద ఆయన విగ్రహానికి చీరాల జర్నలిస్టులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పూలమాలలు వేసి అంబేద్కర్ సిద్ధాంతాలు, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన మహత్తర సేవలను స్మరించుకున్నారు.

అనంతరం చీరాల పట్టణంలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జర్నలిస్టులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని పట్టణ ప్రధాన వీధుల గుండా ర్యాలీగా సాగారు. “అంబేద్కర్ ఆశయాలు వర్థిల్లాలి – సమానత్వ సమాజం స్థాపించాలి” అంటూ నినాదాలు చేస్తూ కార్యక్రమం ఉత్సాహభరితంగా కొనసాగింది.ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు ఎస్వీ కృష్ణారెడ్డి, దగ్గుబాటి రాంబాబు మాట్లాడుతూ అంబేద్కర్ చూపిన మార్గం సమాజానికి ఎప్పటికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. విద్య, సమాన హక్కులు, సామాజిక న్యాయం సాధనలో ఆయన సిద్ధాంతాలు నేటి తరానికి దిక్సూచిగా నిలుస్తాయని తెలిపారు. ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు.

అనంతరం చీరాలలోని ఏరియా ఆసుపత్రిని సందర్శించిన జర్నలిస్టులు రోగులకు, బాలింతలకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సేవా కార్యక్రమాల నిర్వహించడం ఎంతో ఆనందదాయకమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం చీరాల జర్నలిస్టుల ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు మళ్ళా చంద్రశేఖర్, నక్కల రమేష్, కట్టేడి వాసు, దేవరపల్లి దిలీప్ కుమార్, నీరుకట్టు బద్రి, గుడిమోటి అశోక్ కుమార్, కృష్ణ చైతన్య, దేవరపల్లి దిలీప్,షేక్ సుభాని, చినబాబు, వడ్లమూడి సాయి, బత్తులు వెంకయ్య, సాజిద్ ఆలీ, షేక్ మస్తాన్ వలి,కాగితా శేఖర్ బాబు, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
మహబూబాబాద్ ఇద్దరుMPDOలు... ఒక MRO....!
మహబూబాబాద్: ఇద్దరు MPDOలు.. ఒక MRO..! భారత్ అవాజ్ న్యూస్: 12 జూన్ రోజున...
By Gujile Ramu 2026-06-12 10:06:07 0 207
Andhra Pradesh
విజయవాడ మేరీస్ స్టెల్లా కాలేజీలో ఉచిత కంటి వైద్య శిబిరం
మేరీస్ స్టెల్లా కాలేజీలో ఉచిత కంటి వైద్య శిబిరం   అయ్యాన్ హస్పటల్ డాక్టర్ బషీర్...
By Rajini Kumari 2026-01-13 15:57:02 0 265
Andhra Pradesh
నల్లమల అడవుల్లో అరుదైన పీకాక్ టరంటులా సాలీడు... ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి.
అరుదైన పీకాక్ టారంటులా సాలీడు పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం నాగార్జున సాగర్ - శ్రీశైలం టైగర్...
By Pagadala Venkateswar 2026-04-30 04:36:23 0 127
Andhra Pradesh
Rayalaseema Lift Irrigation Scheme: జగన్ చేతకానితనం వల్లే సీమ లిఫ్ట్ ఆగింది: టీడీపీ మంత్రుల ధ్వజం.
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై శాసనమండలిలో తీవ్ర వాగ్వాదం వైసీపీ హయాంలోనే పనులు ఆగిపోయాయని మంత్రులు...
By Pagadala Venkateswar 2026-02-26 11:34:56 0 180
Andhra Pradesh
చౌడేపల్లి ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
చౌడేపల్లి జనసేన టీమ్ కూటమి ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపింది. శ్రీరాముడి ఆశీస్సులు...
By Kothuru Murali 2026-03-26 13:43:23 0 176
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com