సుప్రీంకోర్టు న్యాయవాది మీద పగ తీర్చుకున్నా హైడ్రా కమిషనర్‌ ?

0
181

సుప్రీంకోర్టు న్యాయవాది మీద హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ పగ తీర్చుకున్నారంటూ సోషల్‌మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. అమీన్‌పూర్‌ మండలం ఐలాపూర్‌లో చేపట్టిన కూల్చివేతల్లో భాగంగా ముఖీం అనే న్యాయవాదికి చెందిన నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేసింది. ము ఖీం ఈ స్థలాన్ని ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ హైడ్రా ఒక ప్రకటన విడుదల చేసింది.

‎నేపథ్యంలో గతంలో సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించారంటూ రంగనాథ్‌ను ముఖీం నిలదీశారని, దీంతో నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ ముఖీంకు చెందిన నిర్మాణాలను కూల్చివేశారని స్థానికులు చర్చించుకుంటున్నారు. ముఖీం తండ్రి నిజాం పాలకుల దగ్గర దివాన్‌గా ఉన్న ఓ వ్యక్తి దగ్గర పనిచేసేవాడని, ఆయనతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ముఖీం తండ్రికి 19 ఎకరాలు సమకూరిందని స్థానికులు చెప్తున్నారని హైడ్రా జారీ చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

‎అయితే, ముఖీం ఈ 19 ఎకరాలతోపాటు మరో 21 ఎకరాల మేర కబ్జా చేసి ఫామ్‌హౌస్‌ నిర్మించినట్టు అక్కడ లేఔట్‌ యజమానులు చెప్తున్నారని హైడ్రా తెలిపింది. ఈ నేపథ్యంలో హైడ్రా చేపట్టిన కూల్చివేతల తర్వాత ముఖీంను లక్ష్యంగా చేసుకుని విడుదల చేసిన ప్రకటనలు, ఆయననే టార్గెట్‌గా చేసుకొని కమిషనర్‌ చేసిన వ్యాఖ్యలతో ఇది పూర్తిగా కక్షసాధింపు చర్యగా ఉన్నదని స్థానికులు చర్చించుకుంటున్నారు.

Search
Categories
Read More
Telangana
గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులైన  నీలం స్వరూప కుమారుడు క్రాంతి నూతన...
By Pindikura Mahesh 2026-06-26 03:06:35 0 427
Andhra Pradesh
రౌడీ షీటర్లకు మదనపల్లి డి.ఎస్.పి స్ట్రాంగ్ వార్నింగ్.
మదనపల్లిలో సుమారు 200 మంది రౌడీషీటర్లకు జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు డీఎస్పీ పావని ఆదివారం...
By Pagadala Venkateswar 2026-05-18 04:12:11 0 116
SURAKSHA
Pankaj Joshi, IAS: Steering Gujarat with Vision & Excellence
The Journey Begins "Good governance is not merely about administration—it is about...
By Fathima Safa 2026-07-20 06:35:11 0 115
Andhra Pradesh
అబ్బా.. రెండు కళ్ళు చాలవు.. ఆంధ్రా ఊటీ అరకు అందాలు!!!!!!!!!!!
శీతాకాలం వచ్చిందంటే చాలు.. ఆంధ్ర ఊటి అరకు అందాలు పర్యాటకుల మనసు దోచేస్తాయి. మంచు దుప్పటి...
By SivaNagendra Annapareddy 2025-12-21 14:28:35 0 256
Telangana
శబరిమల యాత్రలో విషాదం
శబరిమల యాత్రలో విషాదం., మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేటకు చెందిన దంపతులు రోడ్డు ప్రమాదంలో మృతి....
By Pinnehasan Odela 2026-01-16 09:09:19 0 312
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com