ప్రతి ఒక్కరూ బాధ్యతతో ప్రవర్తిస్తేనే ప్రమాదాలను తగ్గించి సురక్షిత, రోడ్డు ప్రమాద రహిత సమాజాన్ని నిర్మించవచ్చు : పెద్దపెల్లి డిసిపి రామ్ రెడ్డి

0
228

రామగుండం : వాహనదారులు సురక్షిత ప్రయాణం తో ప్రాణాలతో ఇంటికి చేరుకోవాలి అని రోడ్డు భద్రతపై పోలీసుల అవగాహన కార్యక్రమం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇంద్ర నగర్ లో అరైవ్ లైవ్ కార్యక్రమంలో భాగంగా గోదావరిఖని పట్టణంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని, గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డిసిపి బి రామ్ రెడ్డి రామగుండం మేయర్ మహంకాళి స్వామి గోదావరిఖని ఎసిపి ఎం రమేష్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు 

ఈ సందర్భంగా *ఏసీపీ మాట్లాడుతూ,* ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి వాహనం పై బయలుదేరి పని ముగించుకుని మరల తిరిగి ఎలా అయినా కాదు... ప్రాణాలతో ఇంటికి సురక్షితంగా చేరుకోవాలి” అన్నారు. ఇటీవల గోదావరిఖనిలో జరిగిన పలు రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం డ్రైవర్ల నిర్లక్ష్యమేనని తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా బైక్ నడపడం, సీట్ బెల్ట్ ధరించకపోవడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, సెల్‌ఫోన్ ఉపయోగించడం వంటి చర్యలు ప్రమాదాలకు దారి తీస్తున్నాయని చెప్పారు. వాహనదారులు తమ భద్రత కోసం, తమ కుటుంబాల కోసమే ట్రాఫిక్ నియమాలు పాటించాలని కోరారు. పోలీసులు సేకరించిన ప్రమాదాల వివరాలను విశ్లేషించగా, ఎక్కువ ప్రమాదాలకు వాహనదారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని వెల్లడైంది అన్నారు. కారు, లారీ, బైక్, ట్రాక్టర్ డ్రైవర్లు సైతం ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు.

ముఖ్యంగా ట్రాక్టర్లలో భారీ శబ్దంతో సంగీతం పెట్టడం వల్ల హారన్ వినిపించకపోవడం, బైక్ పై వెనుక కూర్చున్న వారు హెల్మెట్ ధరించకపోవడం వంటి అంశాలు ప్రమాదాలకు దారి తీస్తున్నాయని హెచ్చరించారు.మేయర్ మాట్లాడుతూ.గంజాయి మరియు మత్తు పదార్థాల వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశారు. యువత తప్పుడు మార్గంలో వెళ్లి కుటుంబాలను నష్టపరిచే పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ఇందిరానగర్, సంజయ్ గాంధీనగర్ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని పోలీసు వారు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. మన ప్రాంతం మారాలి, మనమే మారాలి అని అందరూ అనుకోవాలని ఇందిరానగర్, సంజయ్ గాంధీనగర్ ప్రాంతాలను అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. యువత విద్యపై దృష్టి పెట్టి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండి కుటుంబాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. రోడ్డు భద్రతా నియమాలు ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా నిర్లక్ష్యమైన డ్రైవింగ్ చేస్తూ ప్రాణాలను కోల్పోయి గాయాలపాలై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు అన్నారు.

డీసీపీ రామ్ రెడ్డి మాట్లాడుతూ

రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ నియమాలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. రాంగ్ రూట్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం, సెల్‌ఫోన్ ఉపయోగించడం వంటి చర్యలను పూర్తిగా నివారించాలని సూచించారు. ప్రజల సహకారం లేకుండా పోలీసుల ప్రయత్నాలు ఫలించవు. అందరూ కలిసి పనిచేస్తేనే ప్రమాదాలను తగ్గించవచ్చు అని తెలిపారు.పోలీసులు ఈ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి గంజాయి రహిత ప్రాంతంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని డీసీపీ హామీ ఇచ్చారు.

రామగుండం మున్సిపల్ 46వ డివిజన్ పోలీస్ ఆఫీసర్ రమేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు యువత అందరితో రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తామని, మిగతా వారితో పాటించేలా చేస్తామని ప్రమాద రైతు ప్రాంతంగా ఏర్పాటుకు తమ వంతు కృషి తప్పక చేస్తామని ప్రతిజ్ఞ చేపించడం జరిగింది.

 కార్యక్రమంలో వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ ఈ అనూష, బ్లూ క్లోట్స్, పెట్రో కార్ సిబ్బంది, 46 వ డివిజన్ అధ్యక్షుడు అనిల్, స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
సింగరేణిలో “రివ్యూ మీటింగ్‌లు” పేరుతో కాలక్షేపం జరుగుతోందా? అనే ప్రశ్న ఇప్పుడు కార్మికుల్లో తీవ్రంగా వినిపిస్తోంది.
సింగరేణిలో “రివ్యూ మీటింగ్‌లు” పేరుతో కాలక్షేపం జరుగుతోందా? అనే ప్రశ్న ఇప్పుడు...
By Avunoori Mahesh 2026-05-15 02:46:05 0 263
Andhra Pradesh
APSP: ఏపీఎస్పీలో 300 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల అప్‌గ్రేడ్.. ప్రభుత్వ ఉత్తర్వుల జారీ.
ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ (ఏపీఎస్పీ) విభాగంలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుళ్లకు రాష్ట్ర...
By Pagadala Venkateswar 2026-03-28 06:07:27 0 221
Telangana
బోనాల వేడుకల్లో ఎమ్మెల్యే శ్రీగణేష్.|
● మల్కాజ్‌గిరి జోనల్ కమిషనర్ కార్యాలయంలో భక్తిశ్రద్ధలతో వేడుకలు ● ప్రజల ఆయురారోగ్యాలు,...
By Sidhu Maroju 2026-08-05 07:57:41 0 140
SURAKSHA
Retired Telangana Cops: Helping Society With New Purpose
niform తీసేసినా Telangana retired police officers బాధ్యత వదలేదు. Traffic awareness programs...
By Kalaga Sailaja 2026-07-03 10:58:50 0 100
SURAKSHA
Atal Dulloo, IAS: Steering Jammu & Kashmir's Progress
An Experienced IAS Officer Leading Governance, Development, and Administrative Reforms in Jammu...
By Lokeshwari Panthadi 2026-08-03 04:55:28 0 226
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com