విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో వృద్ధురాలి ఆందోళన

0
173

*Avja విజయవాడ*

 

*విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ఉద్రిక్తత – అధికారులపై వృద్ధురాలు కారం చల్లి నిరసన...*

 

*నందిగామ మండలం అనాసాగరం గ్రామంకు చెందిన తులసి అనే వృద్ధురాలు ఈరోజు విజయవాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ సమావేశంలో ఆందోళనకు దిగింది. తన కుటుంబానికి చెందిన వ్యవసాయ భూమిని నేషనల్ హైవే విస్తరణలో తీసుకున్నప్పటికీ ఇప్పటివరకు సరైన పరిహారం చెల్లించలేదని ఆమె ఆరోపించింది.*

*ఈ నేపథ్యంలో, పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా స్పందన లేకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తులసి, సమావేశం జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా అధికారులపై కారం చల్లి నిరసన వ్యక్తం చేసింది. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.*

*సిబ్బంది వెంటనే స్పందించి వృద్ధురాలిని అదుపులోకి తీసుకుని బయటకు పంపించారు. ఈ ఘటనలో ఎవరికి పెద్దగా గాయాలు కాలేదని సమాచారం*.

*వృద్ధురాలు మాట్లాడుతూ, “మూడేళ్లుగా తిరుగుతున్నా న్యాయం జరగడం లేదు*. *మా పొలం తీసుకుని డబ్బులు ఇవ్వలేదు” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.*

*ఈ ఘటనపై అధికారులు స్పందిస్తూ, విషయం పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.*

Search
Categories
Read More
Andhra Pradesh
జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో సత్తా చాటిన పోలీస్ వారసులు
  చీరాల: జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో సత్తా చాటిన చిన్నారులను అభినందించిన జిల్లా...
By Gadiyapudi Narendra 2026-01-27 16:24:52 0 306
Andhra Pradesh
టీడీపీలో చిన్న శ్రీనుకు కీలక పదవి?
జిల్లా YCP అధ్యక్ష పదవికి రాజీనామా చేసి చిన్న శ్రీను TDPలో చేరడం జిల్లా రాజకీయాల్లో ప్రాధాన్యం...
By Boiena Rajesh 2026-09-12 01:03:09 0 139
Telangana
నేడు ఈ జిల్లాలలో ఉరుములతో కూడిన వర్షాలు.....!
భారత్ అవాజ్ న్యూస్: 17 మే  తెలంగాణ రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి....
By Gujile Ramu 2026-05-17 03:40:04 0 160
Andhra Pradesh
మున్సిపాలిటీకి ఉచితంగా ట్రాక్టర్ అందజేసిన కాంట్రాక్టర్ పాలేటి సతీష్
నందిగామ పట్టణం కమ్మ కళ్యాణ మండపం నందు శుక్రవారం నాడు కాంట్రాక్టర్ పాలేటి సతీష్ సౌజన్యంతో నందిగామ...
By Patan Khuddus 2026-05-08 10:32:05 0 326
Telangana
"సర్వస్వం కోల్పోయిన బిఆర్ఎస్ నాయకురాలు: తక్షణ సాయంతో అండగా అనిల్ కిశోర్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  కనజిగూడ డివిజన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది....
By Sidhu Maroju 2026-05-21 06:51:17 0 283
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com