బొల్లారం గ్రౌండ్‌కు ఇంటర్నేషనల్ టచ్.|

0
364

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బొల్లారం ప్రాంతంలోని ప్రముఖ క్రీడా ప్రాంగణం త్వరలోనే కొత్త రూపు సంతరించుకోనుంది. 

కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆదివారం నియోజకవర్గంలోని బొల్లారం సదర్ బజార్ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో ఉన్న బొల్లారం స్పోర్టింగ్ క్లబ్ గ్రౌండ్‌ను సందర్శించి, అభివృద్ధి పనులపై కీలక నిర్ణయాలు ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసిన ఈ చారిత్రాత్మక గ్రౌండ్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ, అత్యధిక నిధులు కేటాయించి ఈ ప్రాంగణాన్ని ఆధునిక సదుపాయాలతో తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.

భవిష్యత్తులో ఈ గ్రౌండ్ నుంచి మరిన్ని అంతర్జాతీయ క్రీడాకారులు వెలువడేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని, నియోజకవర్గానికి ఇది ఒక మోడల్ క్రీడా ప్రాంగణంగా నిలిచేలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

#sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం లో పెరుగుతున్న చలి తీవ్రత
పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాలలో మంగళవారం ఉదయం చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. దీనితో ప్రధాన...
By Kothuru Murali 2026-01-20 14:16:18 0 211
Andhra Pradesh
వీరభద్ర స్వామి శాకాంబరి ఉత్సవం ఆహ్వాన పత్రిక అందజేత
    *ఈనెల 29న శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి వారి దేవస్థానంలో  దేవి...
By Benguluri Madhubabu 2026-07-29 07:05:37 0 248
SURAKSHA
Kona Sasidhar IAS: Driving Education and Digital Governance
A dynamic Andhra Pradesh cadre IAS officer whose leadership in education, digital governance,...
By Lokeshwari Panthadi 2026-07-16 08:31:24 0 111
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:33:57 0 74
SURAKSHA
The Cyber Sentinel: The Inspiring Journey of Dara Kavitha, IPS
Leading the Charge Against Modern Crime: A Story of Innovation, Empathy, and Unyielding Vigilance...
By Kalaga Sailaja 2026-07-14 12:01:36 0 122
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com