"బస్తీ అభివృద్ధికి తలసాని బాట… ప్రజల మాటకే ప్రాధాన్యం.|

0
222

సికింద్రాబాద్: బస్తీ వాసుల అభీష్టం మేరకే అభివృద్ధి పనులు చేపడతామని మాజీమంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.

శుక్రవారం రాంగోపాల్‌పేట్ డివిజన్ పరిధిలోని జీరా బస్తీ, పరిసర కాలనీలలో ఆయన అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జీరా గార్డెన్ సమీపంలో ఉన్న ఖాళీ స్థలాన్ని కమిటీ హాల్ నిర్మాణం కోసం పరిశీలించిన ఎమ్మెల్యే, బస్తీ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూ.19 లక్షల వ్యయంతో జీ ప్లస్ వన్ విధానంలో కమిటీ హాల్ నిర్మించనున్నట్లు తెలిపారు.

అనంతరం జీరా బస్తీలోని శ్రీ లక్ష్మీ నర్సింహ స్వామి ఆలయాన్ని సందర్శించిన ఆయనకు, వర్షాకాలంలో ఆలయం లీకేజీ సమస్యతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు వివరించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వెంటనే ఆలయ మరమ్మతుల కోసం ఆర్థిక సహాయం అందజేశారు.

తదుపరి బస్తీలోని టాయిలెట్లను పరిశీలించిన ఆయన, అవి ఉపయోగించలేని స్థితిలో ఉన్నాయని స్థానికులు తెలిపిన నేపథ్యంలో, కొత్త టాయిలెట్ల నిర్మాణానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అక్కడి నుంచి గార్డెన్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే, పచ్చదనాన్ని పెంచుతూ అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. గార్డెన్‌లోని పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.

అనంతరం బాలాజీ జీరా బస్తీలో పర్యటించిన సందర్భంగా, ఒక నీటి ట్యాంక్ నిర్మించాలని మహిళలు కోరగా, వాటర్ వర్క్స్ అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్థానిక కమిటీ హాల్ శిథిలావస్థకు చేరిందని, కొత్త భవనం నిర్మించాలని కోరగా, ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

జీరా ప్రాంతంలో పర్యటించడం ద్వారా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వాటికి త్వరితగతిన పరిష్కారం చూపడమే లక్ష్యమని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
శ్రీ సీతారామ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు
రామాపురం మండలం కల్పనాయి చెరువు గ్రామం మూలపల్లిలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 20 లక్షల రూపాయలు నిధులతో...
By Benguluri Madhubabu 2026-04-07 06:44:15 0 265
Media Academy
🎯 Why a Media Academy Matters Today
🎯 Why a Media Academy Matters Today With technology revolutionizing communication, journalists...
By Media Academy 2025-05-03 12:41:11 0 4K
Telangana
"బతుకమ్మ"సినిమా మరో "కంతార"లాంటి సంచలన విజయాన్ని అందుకోగలదు ...శ్రీను రావు పొన్నాల
తెలంగాణ సంస్కృతి, జీవన విధానం మరియు ప్రకృతితో ముడిపడిన 'బతుకమ్మ' పండుగ నేపథ్యంతో ఒక సరైన సినిమా...
By Ponnala Srinivasrao 2026-06-12 10:37:10 0 181
Andhra Pradesh
ఏఈ ఉద్యోగాల నియామక పరీక్షకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి గొట్టిపాటి.
AP: విద్యుత్ రంగ సంస్థల్లో ఏఈ ఉద్యోగాల నియామక పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి గొట్టిపాటి...
By Pagadala Venkateswar 2026-08-22 10:20:38 0 100
Andhra Pradesh
పిన్నెల్లి సోదరులు నరహంతకులు రాష్ట్ర ప్రజలు వారి అరెస్టు స్వాగతిస్తున్నారు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న
*ప్ర‌చుర‌ణార్థం* 14-12-2025*     పిన్నెల్లి సోద‌రులు...
By Rajini Kumari 2025-12-15 07:47:09 0 419
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com