అధికారులతో చర్చిస్తున్న బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి

0
183

ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఎండౌమెంట్స్ శాఖ అసిస్టెంట్ కమిషనర్, ఏఈ, ఈఓ మరియు సిబ్బందితో కలిసి దేవాలయాల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా గోపురాల నిర్మాణం, పెయింటింగ్, కంపౌండ్ వాల్, కళ్యాణ మండపాలు మరియు ఇతర సౌకర్యాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు.

నందవరం మండలం గురుజాల రామలింగేశ్వర స్వామి ఆలయం, గోనేగండ్ల మండలం చింతలముని స్వామి ఆలయం, ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల చెన్నకేశవ స్వామి ఆలయం, అలాగే ఎమ్మిగనూరు పట్టణంలోని రామస్వామి ఆలయం, పాత ఆంజనేయ స్వామి ఆలయం మరియు శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే కాకుండా సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలని పేర్కొంటూ, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు తెలిపారు.

ఈ సమావేశంలో ఎండౌమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్, ఏఈ, ఈఓ, సిబ్బంది, ఆలయ పూజారులు మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరిశుభ్రత చర్యలు
పెద్ద దోర్నాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరిశుభ్రత చర్యలు ఇన్‌చార్జి ఎరిక్షన్ బాబు...
By Chennaiah Kati 2026-03-08 08:17:44 0 387
Andhra Pradesh
దళిత, క్రైస్తవ సోదరుల హక్కుల పరిరక్షణకు, సంక్షేమానికి నిరంతరం కట్టుబడి ఉంటాం
దళిత, క్రైస్తవ సోదరుల హక్కుల పరిరక్షణకు, సంక్షేమానికి నిరంతరం కట్టుబడి ఉంటాం... ఈరోజు...
By Chennaiah Kati 2026-07-03 13:00:49 0 97
BMA
Free Speech Hit: YouTuber Arrested at Saharanpur Site
In a troubling incident for independent digital media, local police in Saharanpur arrested a...
By JoinBMA 2026-09-09 05:45:56 0 149
Andhra Pradesh
గుడివాడ బైపాస్ రోడ్ నిర్మాణం పనులు చేపట్టినMLA వెనిగండ్ల రాము గారు
*గుడివాడ ప్రజల భావోద్వేగ సమస్యలలో ఒకటైన... బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తున్నాం:ఎమ్మెల్యే...
By Rajini Kumari 2025-12-28 09:56:25 0 201
Andhra Pradesh
బాపట్ల చేరుకున్న మహారాష్ట్ర యోగా టీం
బాపట్ల చేరుకున్న మహారాష్ట్ర యోగా టీం....  బాపట్ల: జాతీయస్థాయి యోగాసనా ఛాంపియన్షిప్ 2025...
By Gadiyapudi Narendra 2025-12-27 10:47:09 0 496
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com