ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కార్పొరేటర్లకు భూముల పందారంపై ఉద్యమం కొనసాగిస్తాం

0
170

*⭐లులు కంపెనీకి విజయవాడ లో ఆర్టీసీ స్థలం కేటాయింపు రద్దు, ప్రజాపోరాట విజయం*

 

*⭐ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, కార్పొరేట్లకు భూముల పందారంపై ఉద్యమం కొనసాగిస్తాం*

 

-సిహెచ్. బాబురావు, సిపిఎం

 రాష్ట్ర కార్యదర్శి వర్గ

 సభ్యులు 

 

*✊విజయవాడ పాత ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని లూలూ మాల్ కు కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరిస్తున్నట్లు, నేడు హైకోర్టులో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ తెలియజేశారు*

 

*✊లులు కి భూముల కేటాయింపును వ్యతిరేకిస్తూ రైతు నేత శ్రీ వడ్డే శోభనాద్రిశ్వరరావు హైకోర్టులో పిల్ వేయగా, ఈ కేసులో ప్రభుత్వం భూ కేటాయింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు వ్రాతపూర్వకంగా కోర్టుకు తెలిపింది*

 

*✊ఇది ప్రజా పోరాట విజయం, చట్ట విరుద్ధంగా, నిబంధనలు ధిక్కరించి బడా కంపెనీలకు ప్రభుత్వ స్థలాలను అడ్డగోలుగా కేటాయిస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి ఇదొక హెచ్చరిక*

 

*✊కూటమి ప్రభుత్వం విజయవాడలోని పాత ఆర్టిసి బస్టాండ్ లోని 400 కోట్ల రూపాయల విలువైన 4.17 ఎకరాలను భూమిని లులు మాల్ నిర్మాణం కొరకు 99 సంవత్సరాలు లీజుకిస్తూ 2025, జూలై 5వ తేదీన, 137 నెంబర్ జీవో విడుదల చేసింది*

 

*✊చదరపు అడుగు రూ 1.50 పైసలు చొప్పున కారు చౌకగా 2,32,000 చదరపు అడుగుల మూడంతస్తుల భవన నిర్మాణానికి అనుమతించింది*

 

*✊25 దేశాలలో 66 వేల కోట్ల రూపాయల టర్నోవర్ తో నడిపే నడిచే లులు మాల్ ఇంటర్నేషనల్ అనే బడా బహుళ జాతి సంస్థకు ప్రభుత్వ స్థలాలను కట్టబెట్టడం తగదని అనేక ఉద్యమాలు సాగాయి, ప్రజలు ముక్తకంఠంతో నిరసించారు*

 

*✊దేశంలోని ప్రధాన నగరాలన్నింటిలోనూ స్థలాలను మార్కెట్ విలువ ప్రకారం కొనుగోలు చేసుకుని, మాల్స్ నిర్మాణం చేసుకోగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కూటమి ప్రభుత్వం విజయవాడ, విశాఖపట్నంలో విలువైన ప్రభుత్వ భూములను కారు చౌకగా లులు యాజమాన్యానికి కేటాయించడాన్ని ప్రజలందరూ తప్పుపట్టారు వ్యతిరేకత వెల్లువెత్తింది*

 

*✊సిపిఎం చొరవ చూపి పలు ఉద్యమాలు నిర్వహించింది, వామపక్షాలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు,పుర ప్రముఖులు ఐక్య ఉద్యమాలను సాగించారు, పౌరవేదికగా ఏర్పడి ఉద్యమాన్ని ఐక్యంగా కొనసాగించారు*

 

*✊ఇప్పటివరకు ప్రభుత్వం మొండిగా ఆర్టీసీ స్థలం కేటాయింపు రద్దుకు నిరాకరించింది, అభివృద్ధి ముసుగులో భూపందారాన్ని సమర్ధించుకున్నది*

 

*✊ఆర్టీసీ సంస్థను నాశనం చేస్తూ, మరోవైపు చిన్న, మధ్య తరగతి వ్యాపారాలను దెబ్బతీసే విధంగా నగరం నడిబొడ్డున ఉన్న ఈ స్థలాన్ని బడా కంపెనీకి కేటాయించడం అక్రమం అని ప్రజలంతా ఐక్యంగా వ్యతిరేకించారు*

 

*✊ఒకవైపున ప్రజా ఉద్యమం, మరొకవైపున న్యాయపోరాటంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు, ఎట్టకేలకు భూ కేటాయింపును రద్దు చేసింది*

 

*✊చట్టాలు, నిబంధనలను దిక్కరించి, ప్రభుత్వ భూములను అడ్డగోలుగా కేటాయిస్తే పౌర సమాజం సహించదని రుజువయ్యింది*

 

*✊ప్రభుత్వ ఆస్తులను, భూములను పాలకులు పరిరక్షించకపోగా, భక్షిస్తున్నారని అవగతం అయింది, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ప్రజలే ముందుకు రావాలి, ఐక్యంగా ఉద్యమించాలి, ఇదే మార్గమని ఈ పోరాటం చాటిచెప్పింది, రాష్ట్ర ప్రజలకు స్ఫూర్తినిచ్చింది*

 

*✊కార్పొరేట్లకు భూములు దోచిపెట్టడంపై కూటమి సర్కార్ తన వైఖరిని ఇప్పటికైనా మార్చుకోవాలి, ప్రభుత్వ భూముల పరిరక్షణకై ప్రజా ఉద్యమాలు భవిష్యత్తులోనూ కొనసాగాలి. సిపిఎం ఈ పోరులో ముందు నిలుస్తుంది.*

 

*-సిహెచ్.బాబురావు, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్), సిపిఎం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు 9490098400*

Search
Categories
Read More
Telangana
తెలంగాణ జాగృతి కల్వకుంట్ల కవిత గారి ప్రెస్ నోట్
ప్రెస్ నోట్. *రేపు నిజామాబాద్ కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన* *శ్రీ రఘునాథ స్వామి (ఖిల్లా...
By Veeresh Kumar 2026-03-26 14:03:50 0 444
Andhra Pradesh
TTD: తిరుమలలో పట్టు శాలువాల స్కామ్ ఎఫెక్ట్.. టీటీడీ కీలక నిర్ణయం.
ఆప్కో, కోఆప్టెక్స్‌ల నుంచి వస్త్రాలు కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ రూ.43 కోట్ల విలువైన...
By Pagadala Venkateswar 2026-03-05 03:53:19 0 175
Telangana
రాజకీయ వ్యాఖ్యల హద్దులు ఎక్కడ? వివాదాస్పద వ్యాఖ్యలతో మళ్లీ చర్చలో బాల్క సుమన్ అరెస్ట్.!
ప్రజాస్వామ్యంలో రాజకీయ విభేదాలు సహజం. అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య విమర్శలు, ఆరోపణలు,...
By Ponnala Srinivasrao 2026-05-30 08:06:54 0 152
Meghalaya
Shillong Hosts FIFA World Cup 2026 Public Fan Park
The government has launched a vibrant, free public Football Fan-Park at the S.R.G.T. Parking Lot...
By Lokeshwari Panthadi 2026-07-02 06:06:24 0 177
Telangana
ఆసిఫాబాద్‌లో ఈ నెల 22న మినీ జాబ్ మేళా జిల్లా ఉపాధి అధికారి కిరణ్ కుమార్
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్):కుమారం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి...
By Chunarkar Jagadeesh 2026-07-20 14:42:43 0 256
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com