గుడ్ న్యూస్.. హైదరాబాద్ - విజయవాడ మధ్య ‘ఫ్లై 91’ విమాన సర్వీసులు ప్రారంభం.

0
153

 

గుడ్ న్యూస్.. హైదరాబాద్ - విజయవాడ మధ్య ‘ఫ్లై 91’ విమాన సర్వీసులు ప్రారంభం

10-04-2026 Fri 11:43 | Both States

Fly 91 Launches Hyderabad Vijayawada Flight Services

 

హైదరాబాద్ - విజయవాడ మధ్య ప్రయాణించే ప్రయాణికులకు ఒక శుభవార్త. ప్రాంతీయ విమానయాన సంస్థ 'ఫ్లై 91' (Fly 91) తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య తన నూతన సర్వీసులను అధికారికంగా ప్రారంభించింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ సర్వీసును ఈరోజు శ్రీకాకుళం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు.

 

 

ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ... నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ - విజయవాడ మార్గంలో ఈ అదనపు సర్వీసు ప్రయాణికులకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తుందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. సామాన్యులకు సైతం విమాన ప్రయాణాన్ని చేరువ చేయడమే లక్ష్యంగా ఈ సంస్థ తక్కువ ధరలో వేగవంతమైన సేవలను అందిస్తోందని చెప్పారు. దేశవ్యాప్తంగా టైర్-2, టైర్-3 నగరాలను అనుసంధానించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ప్రాంతీయ కనెక్టివిటీని పెంచడం ద్వారా సామాన్యులు కూడా విమానం ఎక్కాలన్న ప్రధాని మోదీ కల నిజమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Telangana
చిన్నారుల అక్షరాభ్యాసం, ఏకరూప దుస్తుల పంపిణీ
చిలుకూరు  మండల కేంద్రంలోని అంగన్వాడి 4 నందు చిన్నారులకు సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య,...
By Nookapangu Manikanta 2026-06-20 12:27:34 0 272
Chandigarh
Global Experts Debate AI Safety at Chandigarh University
The Apex Institute of Technology at Chandigarh University recently concluded its milestone...
By Lokeshwari Panthadi 2026-06-25 11:24:51 0 97
Andhra Pradesh
పుంగనూరునియోజకవర్గం : ఉజ్వల్ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
గురువారం పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, బూరగమంద సచివాలయంలో ఎమ్మార్వో ప్రమీల ఆధ్వర్యంలో పిఎం...
By Kothuru Murali 2026-02-12 14:10:06 0 188
Andhra Pradesh
గ్యాస్ సిలిండర్ కొరత వేల దళారుల దోపిడీ
తాడిపత్రి రూరల్ పరిధి లో నీ వెంకటం పల్లె గ్రామ సమీపంలో ఉన్న కంకర ఫ్యాక్టరీ నందు అక్రమంగా ...
By Gitta Raju 2026-04-09 00:37:02 0 438
Ladakh
Renewable Energy and Solar Power Growth in Ladakh
Ladakh is emerging as a key center for renewable energy development in India, with a strong focus...
By Fathima Safa 2026-06-24 09:45:19 0 153
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com