"దేశ సేవ నుంచి దోపిడీ దారి: రిటైర్డ్ ఆర్మీ అధికారి అరెస్ట్.|

0
341

సికింద్రాబాద్: నగరంలో వరుస చైన్ స్నాచింగ్ ఘటనలకు పాల్పడుతున్న రిటైర్డ్ ఆర్మీ అధికారిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు, అతని వద్ద నుండి సుమారు రూ.7.5 లక్షల విలువైన 5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు అన్నపు రెడ్డి శ్రీనివాస్ రెడ్డి భారత ఆర్మీలో సుమారు 30 సంవత్సరాలు సేవలందించి రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలో ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు.

అయితే షేర్ మార్కెట్‌లో నష్టాలు, ఆన్‌లైన్ బెట్టింగ్ అలవాట్ల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న శ్రీనివాస్ రెడ్డి, తన దురవాట్లు మరియు కుటుంబ అవసరాల కోసం చైన్ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.

ఈ నెల 2, 3 తేదీలలో కాకతీయ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న మహిళల మెడలోని బంగారు గొలుసులను లాక్కొని పరారైన ఘటనల్లో ఇతని ప్రమేయం ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు . 

అతని కోర్టులో హాజరుపరచగా తదుపరి విచారణ కొనసాగుతోందని రైల్వే అధికారులు తెలిపారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Business & Finance
Google and Blackstone Join Forces for Massive AI Cloud Venture
Tech giant Google and private equity firm Blackstone have announced a blockbuster partnership to...
By Dunna Jessicaruth 2026-05-19 10:15:01 0 150
Telangana
*బాధిత కుటుంబానికి సర్పంచ్ పొన్నం సునీత - అనిల్ గౌడ్ పరామర్శ*
తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామానికి చెందిన *ఉప్పులేటి కొమురవ్వ* ఇటీవలే అనారోగ్య కారణాలతో...
By Bouth Arun 2025-12-26 06:58:00 0 696
Andhra Pradesh
చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. మాంసం నింపిన బొమ్మలతో కొత్త ఎత్తుగడ!.
  చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. మాంసం నింపిన బొమ్మలతో కొత్త ఎత్తుగడ!  ...
By Pagadala Venkateswar 2026-06-17 04:19:37 0 113
Andhra Pradesh
శ్రీ సత్యసాయి జిల్లా: ముగ్గరు అవినీతి అధికారులను సస్పెండ్ చేసిన జిల్లా ఎస్పీ గారు
తప్పు చేస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదు - శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ స్పష్టం.......
By Eslavath RameshNaik 2026-01-20 04:41:55 0 695
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా.అలా అవార్డు ఇలా బదిలీ
అన్నమయ్య జిల్లా కలికిరి అప్‌గ్రేడ్ స్టేషన్ CI రామచంద్ర ఉత్తమ అవార్డు అందుకున్న నాడే బదిలీ...
By Pagadala Venkateswar 2026-01-28 10:12:41 0 185
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com