"మున్సిపల్ కార్యాలయాల్లో విజిలెన్స్ షాక్… సడన్ సోదాలతో కలకలం”|

0
247

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ వ్యవస్థలో అక్రమాలపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపల్ కార్యాలయాల్లో ఆకస్మిక సోదాలు నిర్వహించడం కలకలం రేపుతోంది.

ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగాల పనితీరును లక్ష్యంగా చేసుకుని అధికారులు తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. బిల్డింగ్ అనుమతుల మంజూరు, పెండింగ్ ఫైళ్లు, అక్రమ నిర్మాణాలపై తీసుకున్న చర్యలపై లోతైన పరిశీలన కొనసాగుతోంది.

అధికార వర్గాల సమాచారం మేరకు, సూర్యాపేట, ఎల్బీనగర్, హయత్‌నగర్ మున్సిపల్ సర్కిల్ కార్యాలయాల్లో కూడా సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు జారీ చేయడం, ఫైళ్లను నిర్ణీత గడువులో క్లియర్ చేయకపోవడం వంటి అంశాలు అధికారుల దృష్టికి వచ్చినట్లు సమాచారం. దీంతో సంబంధిత శాఖల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ సోదాలు ఒకటి రెండు కార్యాలయాలకు పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందని తెలుస్తోంది. అవసరమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశముందని అధికార వర్గాలు సూచిస్తున్నాయి.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ పోలీస్ చట్టం, 1861లోని సెక్షన్ 30 ప్రకారo 03.02.2026
గుంటూరు జిల్లాలో శాంతిభద్రతలను, శాంతిని మరియు ప్రశాంతతను కాపాడటానికి మరియు ప్రజల రాకపోకలను...
By John Baji 2026-02-04 05:05:21 0 176
SURAKSHA
Crackdown on Chitta: State Alters Anti-Drug Enforcement
Confronting the rising threat of narcotics head-on, the state has launched an aggressive,...
By Lokeshwari Panthadi 2026-07-03 10:44:29 0 124
Andhra Pradesh
మినీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలి: బొబ్బిలి ఎమ్మెల్యే
రామభద్రపురం, బొబ్బిలి మండలాల్లోని గిరిజన గ్రామాలలో మినీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే...
By Boiena Rajesh 2026-08-18 06:08:09 0 98
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా: మదనపల్లెలోభారీ వర్షం.
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో శుక్రవారం మధ్యాహ్నం వాతావరణంలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకున్నాయి....
By Pagadala Venkateswar 2026-06-12 14:21:58 0 127
Telangana
అధికారంలోకి వస్తున్నాం ‎ఉచిత విద్య ఉచిత వైద్యం పై తొలి సంతకాలు ‎అని ప్రకటించిన TRS అధినేత కవిత!
తెలంగాణలో  ‎TRS మళ్ళీ పుట్టింది  ‎తెలంగాణ రాష్ట్ర సేన  ‎కవిత కొత్త...
By Ponnala Srinivasrao 2026-04-25 08:44:46 0 145
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com