తల్లి సురక్షితం.. రాష్ట్రం సుభిక్షం..: దామోదర రాజనర్సింహ.|

0
263

సికింద్రాబాద్ : మాతృత్వం అనేది ప్రతి మహిళకు లభించే గొప్ప వరమని, తల్లి-బిడ్డలు సురక్షితంగా ఉంటేనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ముందుకు సాగుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బోయగూడాలోని మిడ్ వైఫరీ శిక్షణ సంస్థలో నిర్వహించిన సురక్షిత మాతృత్వ దినోత్సవం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా “అనీమియా ముక్త్ భారత్” పోస్టర్‌ను ఆవిష్కరించారు.

అనంతరం కుటుంబ నియంత్రణ, జాతీయ పోషకాహార విలువలు, గర్భిణీ స్త్రీలకు అందించే పౌష్టికాహారం, శిశు సంరక్షణపై ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు.

మంత్రి మాట్లాడుతూ...తెలంగాణ ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా తల్లి, బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని స్పష్టం చేశారు. మిడ్ వైఫరీ విధానాన్ని మరింత బలోపేతం చేసి గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో మాతా-శిశు సంరక్షణ కేంద్రాలను పెంచి, వారికి మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

మిడ్ వైఫరీ శిక్షణ సంస్థలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, మిడ్ వైఫరీల సంఖ్య పెరిగితే శిశు మరణాలు గణనీయంగా తగ్గుతాయని చెప్పారు. గత రెండేళ్లలో 7 వేలకుపైగా నర్సులను నియమించామని వెల్లడించారు.

#sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Telangana
ప్రవేట్ కి ధీటుగా పీఎం శ్రీ పాఠశాల ఫలితాలు
రెండవసారి వరుసగా  వందశాతం ఉత్తీర్ణత  రాజాపేట ఎప్రిల్ 30 మండల కేంద్రంలోని పీఎ శ్రీ బాలుల...
By Pindikura Mahesh 2026-05-01 03:37:31 0 470
Andhra Pradesh
CPIM నేతలు నక్కపల్లి ప్రజల అక్రమ అరెస్టుల ఖండన
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఆంధ్ర ప్రదేశ్ కమిట:        ...
By Rajini Kumari 2025-12-29 10:04:55 0 227
Telangana
ICICIలో గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ అవకాశాలు!
ఉద్యోగార్థులకు సువర్ణావకాశం! ICICI బ్యాంకులో సీనియర్ ఆఫీసర్ ఇన్ రిలేషన్షిప్ మేనేజర్ పోస్టుల కోసం...
By Krishna Balina 2026-02-03 08:57:44 0 260
Kerala
Thiruvananthapuram:Kerala’s capital was on high alert Monday after bomb threats
Thiruvananthapuram:Kerala’s capital was on high alert Monday after bomb threats were issued...
By BMA ADMIN 2025-05-20 05:18:29 0 2K
Telangana
ఫాదర్ బాలయ్య నగర్ ల్లో కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడంతో ఆందోళన
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా :అల్వాల్ సర్కిల్ పరిధిలోని ఫాదర్ బాలయ్య నగర్‌లో ఉన్న...
By Sidhu Maroju 2025-08-21 15:47:41 0 665
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com