ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు సిఐటియు సంపూర్ణ మద్దతు : రాష్ట్ర ఉపాధ్యక్షుడు కామ్రేడ్ భూపాల్

0
280

మంచిర్యాల నియోజకవర్గం : శ్రీరాంపూర్ ఏరియాలో జరిగిన సమావేశంలో ,ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు సీఐటీయు సంపూర్ణ మద్దతు తెలియచేస్తుందని ,రాజ్యాంగ పరిరక్షణ - సవాళ్ళు అనే అంశంపై జరిగే సెమినార్ ను జయప్రదం చేయగలరని ,సీఐటీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్ తెలిపారు జిల్లా కమిటీ సమావేశం బుధవారం రోజున జరిగింది, ఉపాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్  మాట్లాడుతూ కులం, మతం, ప్రాంతం, లింగ బేధం లాంటి సామాజిక అంశాలు మన దేశంలో ప్రజల్ని, కార్మికవర్గాన్ని ఐక్యం కానివ్వకుండా ఆటంకంగా వున్నాయి. కార్మికవర్గంలో సున్నితమైన ఈ అంశాలను దోపిడీ వర్గాల ప్రయోజనాల కోసం పాలక వర్గాలు ముందుకు తెస్తూ కార్మికవర్గ ఐక్యతను విచ్ఛిన్నం చేసి దోపిడీ వర్గాలు తమ ప్రయోజనాలను కాపాడుకుంటున్నయాన్నారు. అన్నిరకాల దోపిడీ, అణచివేత, వివక్షలకు వ్యతిరేకంగా పోరాడి వీటి నుండి శ్రామిక వర్గాన్ని విముక్తి చేసి, పెట్టుబడిదారీ సమాజానికి ప్రత్యామ్నాయంగా కార్మికవర్గ రాజ్యాన్ని స్థాపించాలనే లక్ష్యంతో సిఐటియు పని చేస్తున్నది.ఏప్రిల్ 6 సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్ బి.టి. రణదివే వర్థంతి నుండి ఏప్రిల్ 15 వరకు తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయ సాధన క్యాంపెయిన్ నిర్వహించాలని సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఈ క్యాంపెయిన్ లో సిఐటియు అనుబంధ సంఘాలన్నీ భాగస్వాములు కావాలని, రాష్ట్ర కార్మికవర్గంలో సామాజిక న్యాయ సాధన క్యాంపెయిన్ను విజయవంతం చేయాలని సిఐటియు పిలుపునిస్తున్నది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సంస్థలో పని చేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగ కార్మికులు చేస్తున్న ఆందోళన పోరాటానికి సిఐటియు సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది.ఈ క్యాంపెయిన్ లో భాగంగా ఏప్రిల్ 8,9,10 వ తేదీలల్లో సామాజిక ఉద్యమ నిధిని కార్మికుల నుండి వసూలు చేయాలని, ఈ కార్యక్రమంలో అన్ని స్థాయిల్లోని సిఐటియు యంత్రాంగం పాల్గొనాలని కోరుతున్నది. కార్మికులు, ఉద్యోగులు సామాజిక న్యాయ సాధన క్యాంపెయిన్ పాల్గొని, సామాజిక సంఘీభావ ఉద్యమ నిధికి విరివిగా విరాళాలు అందించాలని కోరారు ,సామాజిక న్యాయ సాధన క్యాంపెయిన్ సందర్భంగా జిల్లా కేంద్రంలో రాజ్యాంగ పరిరక్షణ సవాళ్ళు అనే అంశంపై ఏప్రిల్ 11వ తేదీన సెమినార్ నిర్వహించడం జరుగుతుంది, ఈ సెమినార్లో జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలన్నారు,ఈ సమావేశంలో సంకె రవి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు, సాంబారి వెంకటస్వామి జిల్లా సహాయ కార్యదర్శి , జిల్లా కమిటీ సభ్యులు పద్మావతి,ప్రకాష్, లక్ష్మణ్,దేవదాసు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు జామియా మస్జీద్ కమిటీ నియామకం: వక్ఫ్ బోర్డు ఛైర్మన్ చేతుల మీదుగా
6 ఫిబ్రవరి 2026న, పుంగనూరులోని జామియా మస్జీద్ (రాతి మస్జీద్) కమిటీకి ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు...
By Kothuru Murali 2026-02-07 06:47:08 0 172
Manipur
Kakching Launches Stop Diarrhoea Campaign-2026
Health authorities in Manipur’s Kakching district have officially launched the "Stop...
By Lokeshwari Panthadi 2026-07-02 05:54:23 0 78
Telangana
హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో ఘనంగా "రాష్ట్రీయ ఏక్తా దివాస్".|
   హైదరాబాద్ :  రాష్ట్రీయ ఏక్తా దివాస్: హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో ఘనంగా...
By Sidhu Maroju 2025-10-31 06:47:17 0 243
SURAKSHA
Dial 112: Fast Emergency Response System
 Goa Police upgraded Dial 112 emergency service for instant help. When you call, GPS traces...
By Kalaga Sailaja 2026-07-03 08:06:07 0 101
Andhra Pradesh
కేరళ రాజధాని త్రివేండ్రం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 56 మంది గెలుపు
*కేరళ* రాజధాని *త్రివేండ్రం* (తిరువనంతపురం) మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో *56* మంది...
By Rajini Kumari 2026-02-10 10:35:15 0 253
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com