కడప జిల్లాలో కుక్కల దాడిలో చిరుత కూన మృతి.

0
184

వైఎస్సార్ కడప జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుక్కల గుంపు దాడిలో ఓ చిరుత పులి కూన మృతి చెందింది. దువ్వూరు మండలం చిన్నబకరాపురం గ్రామ శివార్లలో ఈ సంఘటన వెలుగు చూసింది. తీవ్రమైన ఎండల కారణంగా అడవిలో నీటి వనరులు అడుగంటిపోవడంతో, దాహం తీర్చుకోవడానికి చిరుత కూన గ్రామంలోకి వచ్చినట్లు అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు.

 

గ్రామ శివార్లలోని రైతు పుల్లారెడ్డి పొలంలో చిరుత కూన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. నీటి కోసం వచ్చిన చిరుతను వీధి కుక్కలు చుట్టుముట్టి తీవ్రంగా దాడి చేయడంతో అది ప్రాణాలు కోల్పోయిందని గ్రామస్థులు తెలిపారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ డీఆర్ఓ అన్వర్ హుస్సేన్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

 

అనంతరం, చిరుత కూన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిర్వహించారు. చిరుత కూన మృతి చెందడంతో పొలాల్లో చిరుత పులుల సంచారం ఉందేమోనని రైతులు, పశువుల కాపరులు ఆందోళన చెందుతున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పెన్షన్‌దార్లకు ఒక రోజు ముందుగానే నూతన సంవత్సర వేడుకలు చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు. 
పెన్షన్‌దార్లకు ఒక రోజు ముందుగానే నూతన సంవత్సర వేడుకలు చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి...
By Gadiyapudi Narendra 2026-01-01 12:02:34 0 279
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:సోమల మండలంలో రోడ్డు ప్రమాదం
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం పరిధిలోని కందూరు-చౌడేపల్లి రహదారిపై గురువారం ఉదయం జరిగిన రోడ్డు...
By Kothuru Murali 2026-02-19 13:38:31 0 209
SURAKSHA
పఠాంచెరు పోలీసుల అంకితభావం: శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతర కృషి
సంగారెడ్డి జిల్లా పఠాంచెరు పోలీసు అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, శాంతి భద్రతలను కాపాడటంలో...
By Kalaga Sailaja 2026-06-24 13:14:46 0 165
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం : బోయకొండలో భర్తను చంపిన భార్య ప్రియుడు
చౌడేపల్లి మండలం బోయకొండ అటవీ ప్రాంతంలో గాంధీ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. తమిళనాడుకు చెందిన...
By Kothuru Murali 2026-04-07 05:46:27 0 236
BMA
Defending Independent Journalism Against Fake News
While combating misinformation is crucial, the Indian press is fiercely protecting its power...
By JoinBMA 2026-08-20 05:53:21 0 164
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com